తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. దీంతో హైదరాబాద్‌తో సహా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పోలీసులు ముమ్మర తనిఖీలు మొదలుపెట్టారు. ఎన్నికల సందర్భంగా డబ్బు, మద్యం పంపిణీని అరికట్టేందుకు ఎక్కడికక్కడ చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి గట్టి నిఘా ఉంచారు. అన్నిచోట్లా ముమ్మరంగా సోదాలు చేపడుతున్నారు. ఎటువంటి పత్రాలు, ఆధారాలు లేకుండా నగదు, బంగారం, వెండి, మద్యం, ఇతర వస్తువులను తరలిస్తుంటే వాటిని స్వాధీనం చేసుకుంటున్నారు.
ఎన్నికల కోడ్ ఎఫెక్ట్‌తో తెలంగాణలో భారీగా నగదు, బంగారం పట్టుబడుతుంది. ఎక్కడికక్కడ చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేసి.. తనిఖీలు ముమ్మరం చేశారు పోలీసులు. హైదరాబాద్ బంజారాహిల్స్ లో కారులో తరలిస్తున్న 3.50 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల కోడ్ అమలుతో తెలంగాణలో నోట్ల కట్టలు గుట్టలుగా బయటకు వస్తన్నాయి. పోలీసుల తనిఖీల్లో నోట్ల కట్టల కోట్ల మోత మోగుతోంది. బంజారాహిల్స్‌లో గుట్టు చప్పుడు కాకుండా కారులో తరలిస్తున్న రూ. 3.50 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కారులో ఉన్న వారిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ క్రమంలో శనివారం ఉదయం బంజారాహిల్స్‌లో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఏఎమ్మార్ గ్రూప్ సంస్థల చైర్మన్ మహేశ్ రెడ్డి కారులో రూ. 3.50 కోట్లు పట్టుబడ్డాయి. ఆ నగదుకు సంబంధించి ఎటువంటి రశీదు లేకపోవడంతో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అప్పగించారు. ఆయన పక్క రాష్ట్రాల నుంచి డబ్బులు తీసుకొచ్చి రాజకీయ పార్టీలకు అందజేస్తున్నట్లు తేలింది. దాంతో ఆయనకు సంబంధించిన ఏఎమ్మార్ గ్రూప్ సంస్థల్లో కూడా తనిఖీలు చేపట్టారు. మహేష్ రెడ్డి ఏ పార్టీ కోసం డబ్బులు తెస్తున్నారనే దానిపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు.
అలాగే హైదరాబాద్‌లోనే మరో చోట 12 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. నగరంలో పలుచోట్ల చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను ముమ్మర తనిఖీ చేస్తున్నారు పోలీసులు. ఇదేక్రమంలో నల్గొండ జిల్లా అనుములలో ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న రూ. 30 లక్షల నగదును పోలీసులు సీజ్ చేశారు. ఎలాంటి పత్రాలు లేకుండా తరలిస్తున్నట్టు గుర్తించారు.
ఇటీవల కొన్ని
మిర్యాలగూడలో రూ.3.5 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఇక రంగారెడ్డి జిల్లాలో వాహన తనిఖీల్లో 6.55 లక్షల రూపాయలను ఇబ్రహీంపట్నం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హబీబ్ నగర్‌లో 17 లక్షలు సీజ్ చేశారు పోలీసులు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన మూడు రోజుల్లో భారీగా నగదు, బంగారం పట్టుబడింది. ఇప్పటి వరకు 15 కిలోల బంగారం, 400 కిలోల వెండి సీజ్ చేశారు. ఎన్నికల కోడ్ వేళ పాతబస్తీలో అర్థరాత్రి పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించారు. పలుచోట్ల బెల్ట్ షాపులను గుర్తించారు. భారీగా మద్యం స్వాదీనం చేసుకున్నారు.
ఎన్నికల షెడ్యూల్ విడుదల అయినప్పటి నుంచి ఇప్పటివరకు మేడ్చల్ మల్కాజ్గిరి పరిధిలో ఇప్పటివరకు 4 కోట్ల నగదు, 3 కోట్ల విలువైన బంగారు ఆభరణాలతో పాటు, 7 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు అధికారులు. 179 కేసులు నమోదు చేయడంతో పాటు 136 మందిని ఇప్పటివరకు పోలీసులు అరెస్టు చేశారు.
రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున 50 వేల అంటే ఎక్కువ నగదు తీసుకువెళ్లరాదని, ఒకవేళ తీసుకువెళ్తే సరైన పత్రాలు చూపించాలని ఎన్నికల అధికారులు చెప్పారు. లేనిపక్షంలో నగదును సీజ్ చేస్తామని హెచ్చరించారు. అయినా కానీ కోట్లలో నగదు పట్టుబడడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.