నల్గొండ జిల్లాలోని చింతపల్లి మండలం విరాట్ నగర్ కాలనీలో మైసమ్మ గుడి ముందు మనిషి తల ఉన్న కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. జైహింద్ నాయక్ హత్యకు గురైనట్లు పోలీసులు గుర్తించారు. నరబలి కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఈ కేసును రాచకొండ, నల్గొండ పోలీసులు ఉమ్మడిగా దర్యాప్తు చేస్తున్నారు. రాచకొండ ఎస్వోటీ, నల్గొండ సీసీఎస్ పోలీసులు రంగంలోకి దిగారు. వారం రోజులు గడుస్తున్నా నిందితుల ఆచూకీ దొరకలేదు. ఈనెల 10న సాగర్ హైవే మెట్టుమహంకాలి పాదాల వద్ద జైహింద్ తల దొరికింది. హత్య జరిగిన నాలుగు రోజుల తర్వాత హైదరాబాద్ తుర్కయాంజల్ లో నిర్మాణంలో ఉన్న ఇంటిపై తల లేని మొండం లభించింది. హత్యకు గురైన వ్యక్తి సూర్యాపేట జిల్లా శూన్య పహాడ్ తండాకు చెందిన జైహింద్ నాయక్ గా పోలీసులు గుర్తించారు.
Also Read: Corona Updates: పోలీస్ శాఖపై కరోనా పంజా... హైదరాబాద్ పరిధిలోని పలు పీఎస్ లలో భారీగా కేసులు...
ఆ హత్యతో ఏదైనా సంబంధం..?
2018 కేశవనాయక్ హత్య ఈ హత్యకు ఏమైనా సంబంధం ఉందా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తండాలోని ఇంటి యాజమానులతో పాటు పలువురిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. సీసీటీవీ కెమెరాలు, ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: ములుగు జిల్లాలో ఎదురుకాల్పులు... నలుగురు మావోయిస్టుల మృతి
నరబలి కోణంలో దర్యాప్తు
నల్గొండ జిల్లాలో జైహింద్ నాయక్ (30) మతి స్థిమితం లేని వ్యక్తి దారుణహత్య సంచలనమైంది. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్‌లోని ఓ భవనంపై జైహింద్ నాయక్ మొండాన్ని పోలీసులు గుర్తించారు. నల్గొండ జిల్లా చింతపల్లి మండలం నాగార్జున సాగర్, హైదరాబాద్ జాతీయ రహదారి పక్కనే విరాట్‌నగర్ కాలనీలో మెట్టు మహంకాళీ అమ్మవారి విగ్రహం కాళ్ల వద్ద మొండెం లేని తలను ఉంచారు. సామాజిక మాధ్యమాల్లో పెట్టిన తల ఫొటో ఆధారంగా మృతుడ్ని జైహింద్ నాయక్ అని పోలీసులు గుర్తించారు. అతడిది సూర్యాపేట జిల్లా పాకలవీడు మండలం శూన్యపహాడ్ తండా అని నిర్ధారించారు. దారుణహత్యను గుప్త నిధుల కోసం నరబలి ఇచ్చారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తులో తేలాల్సి ఉంది. కేసు మిస్టరీని చేధించేందుకు 8 పోలీసు టీమ్ లను నియమించారు.
Also Read: చెల్లి శవంతో నాలుగు రోజులుగా ఇంట్లోనే అక్క.. అది కుళ్లడంతో చివరికి..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి