Tadepalligudem News : పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు ఎస్సీ కాలనీలో దారుణం ఘటన వెలుగులోకి వచ్చింది. మద్యం మత్తులో కన్న కూతుళ్లను హత్య చేయడానికి ప్రయత్నించాడో గంజి కసాయి తండ్రి. గంజి దావీదు రాజు (రవి) అనే వ్యక్తి మద్యం మత్తులో ఇద్దరు చిన్నారులపై విచక్షణా రహితంగా దాడి చేసిన వీడియో వైరల్ అవుతోంది. చిన్నారులు అని కూడా చూడకుండా అత్యంత దారుణంగా ప్రవర్తించాడు. బిక్కు బిక్కుమంటూ కూర్చొన్న ఇద్దరు చిన్నారులపై మద్యం మత్తులో మృగంలా విరుచుకుపడ్డాడు. చిన్న దెబ్బ తగిలితేనే అల్లాడిపోయే చిన్నారులపై పిడిగుద్దులు కురిపించారు. ఓ చిన్నారిని కాళ్ల పట్టుకుని పైకి లేపి నేలపై విసిరేశాడు. ఇప్పుడా వీడియో వైరల్ అవుతోంది. మృగాలు కూడా తమ పిల్లల్ని ప్రేమిస్తాయే కన్న తండ్రే ఇంత దారుణంగా కొట్టడంపై నెటిజన్లు మండిపడుతున్నారు.
పరారీలో నిందితుడు
దావీదు రాజు భార్య నిర్మల జీవన ఉపాధి కోసం దుబాయ్ లో పనిచేస్తున్నారు. భార్య నిర్మలపై అనుమానంతో ఇద్దరు పిల్లలు అమృత, అలేఖ్యపై విచక్షణారహితంగా దాడి చేశాడు దావీదు రాజు. దుబాయ్ లో ఉన్న భార్య నిర్మలను స్వదేశానికి తీసుకురావాలని పిల్లలను వేధిస్తున్న వీడియోలను భార్యకు పంపుతున్నట్లు తెలుస్తోంది. దావీదు రాజు నిర్మలకు ఇద్దరు ఆడపిల్లలు, ఒక అబ్బాయి ఉన్నారు. ఈ వీడియో వైరల్ అవ్వడంతో పెంటపాడు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పరారీలో ఉన్న దావీదు రాజు కోసం పోలీసులు గాలిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
కూతుళ్లను హింసించి భార్యకు వీడియోలు
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో పెంటపాడులో దారుణం చోటుచేసుకుంది. కువైట్ వెళ్లిన భార్య గంజి నిర్మలను వెనక్కి రాకపోతే ఇద్దరు పిల్లల్ని చంపేస్తా అంటూ భర్త దావీదు రాజు బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇద్దరు ఆడపిల్లల్ని చితకబాదుతూ కత్తితో నరికేస్తా అంటూ బెదిరిస్తూ భార్యకు వీడియో మెసేజ్ లు పంపించాడు. తమను కొట్టవద్దని చిన్నారులు ప్రాధేయపడినా ఆ రాక్షస తండ్రి హృదయం కరగలేదు. మద్యం మత్తులో వీరంగం సృష్టిస్తూ కన్న బిడ్డల్ని గొడ్డుని బాదినట్టు బాదాడు. ఈ వీడియోలను పెంటపాడు పోలీసులకు పంపింది తల్లి నిర్మల. తన పిల్లల్ని రక్షించాలని పోలీసులను వేడుకుంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు చిన్నారులను తమ సంరక్షణలోకి తీసుకున్నారు. నిందితుడు దావీదు రాజుపై కేసు నమోదు చేశారు. పనిపాట లేకుండా భార్య పంపిన డబ్బులతో జల్సాలు చేస్తూ ఇంట్లోనే ఉండేవాడు దావీదు రాజు. ఉపాధి కోసం భార్య గంజి నిర్మలను కువైట్ పంపించాడు. నిత్యం తాగి వచ్చి ఇద్దరు ఆడపిల్లల్ని హింసించడం మొదలుపెట్టాడు. తల్లి కూడా దగ్గర లేకపోవడంతో దావీదు రాజు ఆగడాలకు అడ్డులేకుండా పోయింది. భార్యకు వివాహేతర సంబంధం ఉందని అనుమానంతో పిల్లలపై ప్రతాపం చూపించం మొదలుపెట్టాడు. దుబాయ్ నుంచి తిరిగి రాకుంటే పిల్లల్ని చంపేస్తానంటూ వీడియోలు తీసి నిర్మలకు పంపిస్తున్నాడు. పెంటపాడు పోలీసులు ఇంటికి చేరుకోగా నిందితుడు దావీదు రాజు అక్కడ నుంచి పరారయ్యాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో కర్కశుడైన తండ్రిని కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
Also Read : Karimnagar News : కీడు సోకిందని ఊరు ఖాళీ, మూఢ నమ్మకంతో గ్రామస్తుల వింత నిర్ణయం!
Also Read : Nellore: భార్య గొంతు పిసికి చంపిన భర్త! సినిమా రేంజ్‌లో క్రైమ్ సీన్ క్రియేషన్ - పట్టేసిన పోలీసులు!