పల్నాడు జిల్లాలో రెండు కళాశాలల విద్యార్థుల గ్యాంగ్ వార్ కలకలం రేపింది.  పోటా పోటీగా రోడ్డు మీద పరుగులు తీస్తూ కొట్టుకోవడం తో అక్కడున్న వారందరికీ మొదట ఏమి జరిగిందో అర్థం కాలేదు. కాలేజీ విద్య ప్రారంభ స్థాయిలోనే ఉన్న విద్యార్థులు ఇలా రోడ్డు మీద పడి కొట్టుకోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు.  పల్నాడు జిల్లా క్రోసూరులో ఈ గ్యాంగ్ వార్ జరిగింది. 


చారిత్రక ఆలయంలో విగ్రహాల చోరీ - పీడకలలు రావడంతో దొంగల ముఠా ఏం చేసిందంటే !


పల్నాడు జిల్లా క్రోసూలు మోడల్ స్కూల్లో ఇంటర్ పరీక్షా కేంద్రం  ఉంది. ఇక్కడ పరీక్షలు రాయడానికి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోని పలు స్కూళ్ల విద్యార్థులకు సెంటర్లను ఏర్పాటు చేశారు. మోడల్ స్కూల్లో అచ్చంపేట గురుకుల పాఠశాల విద్యార్థులకు సెంటర్ ఏర్పాటు చేశారు. విద్యార్థులంతా పరీక్షా సమయానికి క్రోసూరు చేరుకున్నారు. పరీక్ష రాసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత విద్యార్థులపై కొంత మంది దాడి చేశారు. దాంతో వారు భయంతో పరుగులు తీశారు. మరి కొంత మంది ఇతర స్కూళ్లలో పరీక్షలు రాసిన అచ్చంపేట విద్యార్థులతో కలిసి  ..  ఎదురు దాడికి దిగడంతో  పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 


ప్రియుడితో వెళ్లిపోయిన భార్య, తిరిగొచ్చేస్తానని మళ్లీ భర్తకు ఫోన్ - ఊహించని షాక్ ఇచ్చిన భర్త


అయితే ఇది ఏదో చిన్న గొడవ కారణంగా వచ్చిన వివాదం కాదని స్థానికులు చెబుతున్నారు. కొంత కాలంగా అచ్చంపేట గురుకుల పాఠశాల విద్యార్థులతో క్రోసూరులోని కొంత మంది విద్యార్థులు గొడవ పడుతున్నారు. రకరకాల వివాదాలతో గ్యాంగ్ వార్ తరహాలో ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్నారు. ఈ క్రమంలో అచ్చంపేట నుంచి విద్యార్థులు క్రోసూరులో పరీక్ష రాయడానికి వచ్చినట్లుగా సమాచారం రావడంతో.. క్రోసూరులో ఉన్న విద్యార్థులు కాపు కాసి పరీక్ష రాసి వస్తున్న వారిపై దాడులకు దిగినట్లుగా తెలుస్తోంది. 


‘పైసలియ్యి, లేకుంటే చావు’ పెళ్లి కాకముందే కట్నం కోసం వరుడి మెసేజ్‌లు - యువతి ఆత్మహత్య
 
గత మూడు నెలల నుంచి ఇలాంటి దాడులు జరుగుతున్నాయని.. స్థానికులు చెబుతున్నారు. గ్యాంగ్ వార్ తరహాలో పిల్లలు పొట్లాడుకుంటూంటే పోలీసులు కూడా పట్టించుకోవడం లేదని అంటున్నారు.   స్థానికులు ఈ అంశంపై సమాచారం ఇచ్చినా స్పందన లేదని అంటున్నారు. కేసులు పెడితే విద్యార్థుల భవిష్యత్ పాడైపోతుందని కనీసం కౌన్సిలింగ్ అయినా ఇవ్వాలని అంటున్నారు.