Double Decker Bus Collided With A Water Tanker In UP: ఉత్తరప్రదేశ్‌లో (Uttarapradesh) ఒకే రోజు 2 ఘోర ప్రమాదాలు తీవ్ర విషాదాన్ని నింపాయి. వేర్వేరు చోట్ల జరిగిన ఘటనల్లో 12 మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూపీలోని కన్నౌజ్ జిల్లాలో శుక్రవారం మధ్యాహ్నం ఆగ్రా - లక్నో ఎక్స్‌ప్రెస్ వేపై ప్రయాణికులతో వెళ్తున్న ఓ డబుల్ డెక్కర్ బస్సు అదుపు తప్పి ట్యాంకర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని స్థానికుల సాయంతో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
మరో ఘటనలో ఆరుగురు..
అటు, మరో ఘటనలోనూ ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం తెల్లవారుజామున ఝాన్సీ - మీర్జాపూర్ హైవేపై వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి ఎదురుగా వస్తోన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు స్పాట్‌లోనే మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు అక్కడికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.