Sirisilla: తెలంగాణ రాజన్న సిరిసిల్ల(Sirisilla) జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో కడమంచి లచ్చవ్వ అనే మహిళ తన ఇంట్లో జరుగుతున్న గొడవలకు విసుగు చెంది బావిలో దూకి ఆత్మహత్యాయత్నం(Suicide Attempt) చేసింది. కొన్ని గంటల పాటు బావిలో ఉండడంతో విషయం తెలుసుకున్న గ్రామస్తులు అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడి చేరుకున్న పోలీస్ సిబ్బంది రక్షణ చర్యలు చేపట్టారు. సిరిసిల్ల అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో అక్కడి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఆ మహిళను పోలీసులు ఇతర గ్రామస్థుల సహకారంతో రెండు గంటల పాటు కష్టపడి బయటికి తీశారు. తన ఇంట్లో జరుగుతున్న గొడవలు(Family Dispute) కారణంగానే ఆత్మహత్యకు ప్రయత్నించానని ఆమె తెలిపారు. ఆ మహిళను కాపాడిన ఫైర్ స్టేషన్ ఆఫీసర్ సతీష్ రావు ,ఫైర్ మెన్ నరసింహాచారి, పోలీసు సిబ్బందిని గ్రామస్తులు అభినందించారు. కుటుంబ కలహాల కారణంగానే ఆత్మహత్యకు ప్రయత్నించాయని మహిళ ఆవేదనతో చెప్పింది. పోలీసులు ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చారు.
Read Also : తక్కువ ఖర్చుతో ట్రాన్స్‌జెండర్ ఆపరేషన్, అమ్మాయిగా మారాలనుకున్న యువకుడి కథ విషాదమే !
గోదావరిలో దూకి నవ వధువు ఆత్మహత్య
పశ్చిమగోదావరి జిల్లా పోలవరం(Polavaram)లో విషాదం చోటుచేసుకుంది. కాళ్లపారాణి ఆరకముందే నవ వధువు గోదావరి(Godavari)లో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఏం కష్టం వచ్చిందో తెలియదు గానీ పెళ్లైన ఏడో రోజులకే ఈ దారుణానికి పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. ఈనెల 20న పట్టిసీమ గ్రామానికి చెందిన కరిబండి అనురాధకు, కృష్ణా జిల్లా తిరువూరుకు చెందిన శివప్రసాద్ తో వివాహం(Marriage) అయింది. పుట్టింటికి వచ్చిన అనురాధ శనివారం గోదావరి నది వద్దకు వెళ్లింది. అక్కడున్న జాలర్లు చూస్తుండగానే గోదావరిలో దూకింది. జాలర్లు వెంటనే ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు గోదావరిలో వెతికినా ఆమె ఆచూకీ లభ్యం కాలేదు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ప్రమాదస్థలికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. జాలర్ల సాయంతో గోదావరి నదిలో గాలిస్తున్నారు. అయినా ఫలితం లేకపోవడంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. పెళ్లైన ఏడు రోజులకే నవ వధువు ఇంతటి దారుణానికి పాల్పడడంతో కుటుంబంలో విషాదంలో మునిగిపోయింది.