సహోద్యోగులపైనే పేలుతున్న తుపాకులు
దిల్లీలో, సిక్కింకు చెందిన పోలీస్ తోటి ఉద్యోగులను కాల్చి చంపాడు. దిల్లీలోని హైదర్‌పూర్‌లో వాటర్ ప్లాంట్ దగ్గర ఈ హత్యలు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తరలించగా, కాసేపటికే మృతి చెందాడు. పోలీసులు నిందితుడుని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఎందుకు ఈ దాడి చేశాడన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు. గత వారంలో జమ్ము, కశ్మీర్‌లోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. పూంచ్ జిల్లాలో ఓ సోల్జర్, ఇద్దరు సైనికుల్ని కాల్చి చంపాడు. వ్యక్తిగత విషయాలు మాట్లాడారన్న కోపంతో విచక్షణారహితంగా గన్‌తో కాల్చినట్టు అక్కడి పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో ఇద్దరు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. గతేడాది నవంబర్‌లో ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలోనూ ఇంతే. సీఆర్‌పీఎఫ్‌కు చెందిన ఓ సైనికుడు, నలుగురు సైనికులను కాల్చి చంపాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలపాలై, ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. పార్లమెంటరీ క్యాంప్ వద్ద నిందితుడు కాల్పులు జరిపినట్టు పోలీసులు తెలిపారు.