Siddipet Woman Kills Husband: ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తను అత్యంత దారుణంగా మట్టుబెట్టిన ఓ భార్య వ్యవహారం సిద్దిపేట జిల్లాలో వెలుగు చూసింది. పెళ్లి జరిగి రెండు నెలలు కూడా కాకముందే భర్తను చంపేసింది. పెద్దలు బలవంతంగా ఆమెను ఒప్పించి పెళ్లి జరిపించడమే ఇందుకు కారణం అని పోలీసులు గుర్తించారు. అంతకుముందు ఉన్న ప్రియుడి మోజులో పడి భర్తను హతమార్చింది. అందుకు రెండు ప్రయత్నాలు చేసింది. మొదటిసారి అన్నంలో విషం కలిపి పెట్టగా, అది విఫలం అయింది. రెండోసారి గొంతు పిసికి చంపింది. 


చేసిన హత్యాయత్నం విఫలం కాగా.. రెండోసారి గొంతు నులిమి చంపేసింది. ఛాతీలో నొప్పితో చనిపోయాడని నాటక మాడింది. పోలీసుల దర్యాప్తులో హత్య విషయం వెల్లడవడంతో.. జైలు పాలైంది. పెళ్లయిన 36 రోజుల్లోనే ఇవన్నీ జరగడం గమనార్హం.


పోలీసులు వెల్లడించిన వివరాలివీ.. సిద్దిపేట జిల్లాలో ఏప్రిల్ 28న ఈ హత్య జరిగింది. దుబ్బాక మండలం చిన్న నిజాంపేటకు చెందిన కోనాపురం చంద్రశేఖర్‌ అనే 24 ఏళ్ల వ్యక్తికి తొగుట మండలం గుడికందుల గ్రామానికి చెందిన శ్యామల అనే 19 ఏళ్ల యువతితో గత మార్చి 23న పెళ్లి జరిగింది. అదే ఊరికి చెందిన శివకుమార్‌ అనే 20 ఏళ్ల వ్యక్తితో శ్యామల మూడేళ్లుగా ప్రేమలో ఉంది. కానీ, పెద్దల ఒత్తిడితో చంద్రశేఖర్‌ను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. కాపురం నచ్చకపోవడంతో ప్రియుడు శివతో కలిసి హత్యకు ప్లాన్ వేసింది.


Also Read: Vizianagaram Kidnap : కూల్ డ్రింక్స్ ఆశ చూపి ఇద్దరు చిన్నారులను కిడ్నాప్, గంటల వ్యవధిలో కేసును ఛేదించిన పోలీసులు


ఆహారంలో విషం కలిపి..
అందుకోసం మొదటి ప్రయత్నంలో భాగంగా గత నెల 19న తినే ఆహారంలో ఎలుకల మందు కలిపింది. ఆస్పత్రికి తరలించడంతో భర్త బతికాడు. ఫుడ్ పాయిజన్ అయిందని భావించాడు. కొద్ది రోజుల తర్వాత ఓ మొక్కు ఉందంటూ ఏప్రిల్‌ 28న శ్యామల తన భర్తను తీసుకొని బైక్‌పై అనంతసాగర్‌ శివారుకు తీసుకెళ్లింది. ఏకాంతంగా ఉందామని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లింది. అక్కడ ప్రియుడు, అతడి స్నేహితులు కలిసి గొంతు పిసికి చంపేశారు.


అయితే, తన భర్త ఛాతీలో నొప్పితో చనిపోయాడని అందర్నీ నమ్మించింది. కానీ, అత్తామామలు మణెవ్వ, ఫ్యామిలీ పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణలో ఈ సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపర్చారు.


Also Read: Nalgonda News : నల్గొండలో వైద్యుల నిర్లక్ష్యం, మహిళ కడుపులో దూది పెట్టి కుట్టేశారు