Phone Mistake Unravels Murder: ఏడాదిన్నర కిందట ఢిల్లీశివారులో ఓ గుర్తు తెలియని మృతదేహం బయటపడింది. ఆ మృతదేహం తమ వారిదేనని ఎవరూ రాలేదు. దాంతో పోలీసులే అంత్యక్రియలు ముగించేశారు. కానీ రికార్డుల్లో మాత్రం ఆ కేసు అలా ఉండిపోయింది. 
 
2025 జూన్‌లో ఓ దొంగతనం కేసులో పోలీసులు విజయ్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. అతని వద్ద ఉన్న ఫోన్ స్వాధీనం చేసుకుని పరిసీలన చేయడంతో అసలు విషయం బయటపడింది. ఓ హత్య చేశారని..అది ఏడాదిన్నర కిందట దొరికిన గుర్తు తెలియని మృతదేహంతో సంబంధం ఉన్న కేసని తెలియడంతో ఫైల్స్ బయటకు తీశారు. ఆ చనిపోయిన వ్యక్తి భార్యే అసలు సూత్రధారి అని గుర్తించి అరెస్టు చేశారు. 

Continues below advertisement


 దిల్లీలోని అలీపూర్‌లో నివాసం ఉండే సోనియా అనే మహిళ భర్త ప్రీతమ్. తాగుడు, డ్రగ్స్ కు బానిసై భార్యను వేధిస్తూ ఉండేవాడు. ఆటో తోలుతూ వచ్చిన డబ్బలన్నీ వ్యసనాలకే ఖర్చు పెట్టేవాడు. అంతే కాక పదికిపైగా కేసుల్లో నిందితుడు. దాంతో సోనియా రోహిత్ అనే మరో వ్యక్తితో పరిచయం పెంచుకుంది. అతను క్యాబ్ డ్రైవర్. ఇద్దరి మధ్య పరిచయం అక్రమ సంబంధానికి దారి తీసింది. రోహిత్ కు కూడా నేర చరిత్ర ఉంది.  అయినా సరే  వారిద్దరూ సన్నిహితంగా మారి, చివరికి వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే, ప్రీతమ్   అడ్డంకిగా ఉన్నాడు. అందుకే హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు.                        


  2024 జులై 2న, సోనియా తన సోదరి దీపా నివాసం ఉండే  గన్నౌర్  వెళ్లింది. అక్కడికి  ప్రీతమ్ ను పిలిపించి హత్య చేయాలనుకున్నారు. కానీ రోహిత్ తాను ఒక్కడిని హత్య చేయలేనని మరో కిల్లర్ ను మాట్లాడుకోవాలంటే ఆరు లక్షలు ఖర్చవుతుందని చెప్పాడు. కుదరకపోవడంతో వెళలిపోయాడు. అదే సమయంలో తన బంధువు అయిన విజయ్ అనే వ్యక్తిని హత్య కోసం సంప్రందించింది. లక్ష ఇస్తే చంపేస్తానని అతను బేరం మాట్లాడాడు. ముందుగా యాభై వేలు ఇచ్చింది. ప్రీతమ్ ను గన్నౌర్ కు పిలిపించిన భార్య.. నిద్రిస్తున్న సమయంలో హత్య చేయడానికి సహకరించింది. తర్వాత శవాన్ని కాలువలో పడేశారు.                 


హత్య తర్వాత, సోనియా ప్రీతమ్ ఫోన్‌ను తీసుకుంది.  విజయ్ హత్య జరిగిన తర్వాత సోనియాకు శవం   వీడియో ,  ఫోటోను సోషల్ మీడియా ద్వారా పంపాడు, తర్వాత వాటిని డిలీట్ చేశాడు. సోనియా ప్రీతమ్ ఆటో రిక్షాను  విక్రయించి, అప్పులు తీర్చింది.  సోనియా, ప్రీతమ్ ఫోన్‌ను రోహిత్‌కు ఇచ్చి, దాన్ని నాశనం చేయమని కోరింది, కానీ రోహిత్ ఆ ఫోన్‌ను నాశనం చేయకుండా ఉంచాడు. పోలీసులకు దొరికిపోవడం వారు అందులో ఉన్న డేటాను బయటకు తీయడంతో హత్య విషయం బయటపడింది. ఏడాదిన్నర తర్వాత దొరికిపోయారు.