Severe Road Accident In Nellore: నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం ముసునూరు టోల్ ప్లాజా వద్ద బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లారీని ఓవర్ టేక్ చేయబోయి కారు వెనుక నుంచి ఢీకొన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులు ఏలూరు జిల్లా కొయ్యలగూడేనికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. చెన్నైలో ఇమిటేషన్ గోల్డ్ కొనుగోలు చేసి తిరిగి కొయ్యలగూడెంకు వస్తుండగా తెల్లవారుజామున 3:30 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జు నుజ్డైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Also Read: Pawan Kalyan Politics : ఎన్నికల తర్వాత రెండేళ్లు పవన్ బిజీ షెడ్యూల్ - గెలిచినా పదవులు చేపట్టే ఉద్దేశం లేదా ?