Fire Accident in Bandlaguda Super Market: రంగారెడ్డి (Rangareddy) జిల్లా రాజేంద్రనగర్ (Rajendranagar) పరిధిలో గండిపేటలో ఆదివారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బండ్లగూడ రత్నదీప్ సూపర్ మార్కెట్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.  గతంలో ఫంక్షన్ హాల్ గా ఉన్న దీన్ని సూపర్ మార్కెట్ గా మారుస్తున్నారు. వెల్డింగ్ పనులు చేస్తున్న క్రమంలో మంటలు వ్యాపించాయి. దట్టమైన పొగ వ్యాపించడంతో అందులో పనిచేస్తున్న సిబ్బంది భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని రెండు ఫైరింజన్లతో భారీగా ఎగసిపడ్డ మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో దాదాపు రూ.కోటి ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు.


Also Read: Modi on Madhavi Latha: కొంపెళ్ల మాధవీ లతపై మోదీ ప్రశంసలు, అందరూ ఆ ప్రోగ్రాం చూడాలన్న ప్రధాని