సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో అత్యంత దారుణమైన ఘటన జరిగింది. పెళ్లైన ఓ మహిళపై గ్యాంగ్ రేపు జరిగిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 24 ఏళ్ల వివాహితను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఆటోలో జహీరాబాద్ కు తీసుకువచ్చి అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. సరిగ్గా జహీరాబాద్ శివారులోని డిడిగి అనే పేరు గల గ్రామంలోని నిర్మానుష్య అటవీ ప్రాంతంలో ఈ ఘటనను స్థానికులు గుర్తించారు.
బాధిత మహిళను సికింద్రాబాద్ కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఆటో ఎక్కిన ఆమెకు మత్తుమందు ఇచ్చి అక్కడికి తీసుకొచ్చారా? లేక మాయమాటలు చెప్పి తీసుకొచ్చారా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం (సెప్టెంబరు 23) రాత్రి కూకట్‌పల్లి నుంచి బాధిత వివాహితను తీసుకొచ్చి జహీరాబాద్‌లో అత్యాచారానికి పాల్పడినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. అనంతరం ఆమెను అక్కడే వదిలి పోయారు. ఈ ఘటనను స్థానికులు శనివారం ఉదయం గుర్తించి జహీరాబాద్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.