UP Man Kills Mother 4 Sisters: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఓ హోటల్ గదిలో తన నలుగురు అక్క చెల్లెళ్లతో పాటు తల్లిని కూడా నరికి చంపిన ఓ యువకుడి వ్యవహారం సంచలనంగా మారింది. హత్యల తర్వాత అతను ఓ వీడియో విడుదల చేశారు. తాను వారిని చంపినా వారి గౌరవాన్ని కాపాడానని చెప్పుకొచ్చాడు. తన తల్లితో పాటు అక్కచెల్లెళ్లను అమ్మేసేందుకు కుట్ర చేశారని అంటున్నారు. అందుకే వారికి అలాంటి పరిస్థితి లేకుండా చంపేశానని చెప్పుకొచ్చాడు. తాను కూడా చచ్చిపోతానని ఆ వీడియోలో పేర్కొన్నాడు. హైదరాబాద్‌కు చెందిన వ్యక్తులకు అక్కాచెల్లెళ్లను అమ్మాలనుకున్నారని ఆరోపించాడు.
ఈ హత్యలకు పాల్పడిన వ్యక్తిని ఆర్షద్‌గా గుర్తించారు. తల్లికి, అక్కచెల్లెళ్లకు మద్యం తాగించి, భోజనంలో మత్తు పదార్థాలు కలిపి.. మత్తులో ఉన్న సమయంలో వారిని చంపేసినట్టు పోలీసులు చెబుతున్నారు. ముందుగా ఈ ఐదుగురి చేతి మణికట్టులను కోశాడని, ఆ తర్వాత వారు తీవ్ర రక్తస్రావంతో మృతి చెందాని ప్రాథమిక విచారణలో తేలినట్టు అధికారులు చెబుతున్నారు.
వారు డిసెంబర్ 30న హోటల్‌లో రూమ్ తీసుకున్నారు. హోటల్ సిబ్బంది ప్రకారం సోదరుడితో పాటు తండ్రి కూడా వారితోనే ఉండి ఉండాలి. కానీ ప్రస్తుతం అతను పరారీలో ఉండడంతో అతన్ని కూడా పోలీసులు అనుమానితుడిగా భావిస్తున్నారు. ఈ వ్యవహారం ఉత్తరప్రదేశ్‌లోనే కాదు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
ఆర్థిక సమస్యలు, కుటుంబ ఆస్తుల కారణంగా అతని మానసిక స్థితి చెడిపోయి ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. తమ ఇంటి స్థలం ఆలయం రావాలని ఆయన వీడియోలో చెప్పాడు.