ఫుడ్ డెలివరీ బాయ్స్ ముసుగులో దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను హైదరాబాద్‌‌లో పోలీసులు అరెస్టు చేశారు. ఈ వ్యవహారం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సంగారెడ్డి నుంచి హైదరాబాద్‌కు బతుకుదెరువు కోసం వచ్చి ఫుడ్ డెలివరీ బాయ్స్‌గా చెలామణి అవుతూ నేరాలకు పాల్పడుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. వీరు ఇళ్లలో కిటికీలకు దగ్గరగా ఉండే ల్యాప్ ట్యాప్‌లను దొంగిలిస్తుంటారని తెలిపారు. ఈ ముఠా మొత్తం నలుగురు వ్యక్తులు అని వెల్లడించారు.


పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇళ్లలోని ల్యాప్‌ టా‌ప్‌లను దొంగిలించే నలుగురు వ్యక్తులతో కూడిన ఓ ముఠాను కూకట్‌పల్లి పోలీసులు అరెస్టు చేశారు. సంగారెడ్డికి చెందిన పాటిల్‌ శివాజీ అనే 23 ఏళ్ల వ్యక్తులు, బోయిన్‌ వెంకటేశం అనే 21 ఏళ్ల యువకుడు, అజ్జంపల్లి గోవర్ధన్‌ రెడ్డి అనే 23 ఏళ్ల మరో వ్యక్తి ముగ్గురు స్నేహితులుగా ఉన్నారు. వీరిలో ఇద్దరు వెంకటేశం, గోవర్ధన్‌ రెడ్డి కూకట్‌ పల్లి ఎల్లమ్మబండలో ఉంటూ ప్రముఖ ఫుడ్ డెలివరీ ఫుడ్‌ డెలివరీ యాప్‌లలో బాయ్స్‌గా పనిచేస్తున్నారు. ఆ తర్వాత వీరితో పాటిల్‌ శివాజీ అనే వ్యక్తి కలిశాడు. వీరంతా ముఠాగా ఏర్పడి దొంగతనాలు చేయడం మొదలుపెట్టారు. కొద్ది రోజులుగా ఫుడ్‌ డెలివరీ బాయ్స్‌గా పని చేస్తూ కాలనీల్లో రెక్కీ నిర్వహించేవారు. ఇళ్ల కిటికీలు తెరిచి ఉండడాన్ని గమనించేవారు. ఇళ్లలోని కిటికీలు, తలుపుల వద్ద ఉన్న వాటిని దొంగిలించేవారు.


ఇలా చేస్తూ కూకట్‌ పల్లి ప్రాంతంలోనే ఏడు ల్యాప్‌ టాప్‌లు, ఐ ప్యాడ్‌లను దొంగిలించారు. ఈ నెల 22న వారు కొట్టేసిన ల్యాప్‌ టా‌ప్‌లను కేపీహెచ్‌బీ కాలనీలోని పద్మావతి ప్లాజాలో అమ్మేందుకు ఈ ముగ్గురు నిందితులు కలిసి వచ్చారు. బైకు నెంబరు టీఎస్ 15 ఈడబ్ల్యూ 8823పై వచ్చారు. అక్కడే తనిఖీలు చేస్తున్న పోలీసులు వీరిపై అనుమానం కలిగి అదుపులోకి తీసుకొని విచారణ జరపగా.. ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మొత్తం నేరాలను ఒప్పుకొన్నట్లుగా పోలీసులు తెలిపారు. వారి నుంచి 7 ల్యాప్‌టా‌ప్‌లు, ఒక ఐ ప్యాడ్‌, ఒక బైకును స్వాధీనం చేసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు క్రైం పోలీసులు వెల్లడించారు.


Also Read: Private Part Cut: పెద్దల్ని ఎదిరించిన లవర్స్, అతని ప్రైవేట్ పార్ట్స్ కోసేసి.. అడవిలో పడేసి ఘోరం!


Also Read: Prakasam: భార్యను తన దగ్గరికి పంపాలని భర్తకు ఫోన్, కామాంధుడిపై పోలీసులకు ఫిర్యాదు.. అది తెలిసి దాష్టీకం


Also Read: Divorce: దుబాయ్ రాజు విడాకులు.. భార్యకు భరణం ఎన్ని కోట్లు చెల్లించాలో తెలుసా


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి