Robbery In Gold Shop in Hyderabad: హైదరాబాద్ (Hyderabad)లో దొంగలు రెచ్చిపోయారు. పట్టపగలే ఓ నగల దుకాణం యజమానిపై కత్తులతో దాడి చేసి సినీ ఫక్కీలో భారీ చోరీకి తెగబడ్డారు. బుధవారం మధ్యాహ్నం చాదర్ ఘాట్ (Chadarghat) పోలీస్ స్టేషన్ పరిధిలోని అక్బర్ బాగ్ చౌరస్తాలో ఉన్న కిశ్వా జ్యూయలర్స్ షాప్ లో దుండగులు బీభత్స సృష్టించారు. బైక్ పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు దుకాణంలోకి ఒక్కసారిగా చొరబడి యజమానిపై కత్తితో దాడి చేశారు. అనంతరం షాపులోని బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బాధితున్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. క్లూస్ టీం, సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దుండగులను గుర్తించే పనిలో పడ్డారు. దుకాణంలో ఎంతమేర బంగారం చోరీకి గురైందనే వివరాలు తెలియాల్సి ఉంది. అటు, పట్ట పగలే నగల దుకాణంలో దొంగలు బీభత్స సృష్టించడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.


Also Read: Rajiv Gandhi Statue at Secretariat : సెక్రటేరియట్‌లో రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన - కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ ఆగ్రహం !