శ్రీ సత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ - బెంగళూరు జాతీయ రహదారిపై కొడికొండ చెక్ పోస్ట్ సమీపంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు, లారీ ఢీ కొన్నాయి. ఈ దుర్ఘటనలో బస్ డ్రైవర్ జియా దుర్మరణం చెందాడు. ఆ సమయంలో బస్సు నిండా ప్రయాణికులు ఉండగా, మొత్తం 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ తెల్లవారుజామున ఉదయం 4 గంటలకు ప్రమాదం జరిగింది. దీంతో ఆ రహదారి గుండా వెళ్లేవారు తక్షణం స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అప్రమత్తం అయిన చిలమత్తూరు పోలీసులు అక్కడికి చేరుకొని సహాయ కార్యక్రమాలు అందించారు. గాయపడ్డవారిని హిందూపురం, బాగేపల్లి ఆసుపత్రలకు పోలీసులు తరలించారు.
Bus Accident: బెంగళూరు-హైదరాబాద్ హైవేపై ప్రమాదం, ప్రైవేటు బస్సు - లారీ ఢీ
ABP Desam
Updated at:
24 May 2022 07:23 AM (IST)
ఈ తెల్లవారుజామున ఉదయం 4 గంటలకు ప్రమాదం జరిగింది. దీంతో ఆ రహదారి గుండా వెళ్లేవారు తక్షణం స్పందించి పోలీసులకు సమాచారం అందించారు.
లారీని గుద్దిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు