Chittoor Road Accident: చిత్తూరు: చిత్తూరు సమీపంలోని ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న టిప్పర్ ను తప్పించబోయి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. గంగాసాగరం వద్ద జరిగిన ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, 22 మందికి గాయాలయ్యాయి.
చిత్తూరు తిరుచ్చి హైవే నిర్మాణ పనుల్లో భాగంగా ఆగి ఉన్న టిప్పర్ ను తప్పించే క్రమంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు తిరుపతి నుంచి తిరుచ్చికి వెళ్తున్న క్రమంలో ప్రమాదం జరిగింది. గురువారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఘటన జరిగింది. అతివేగంగా దూసుకొచ్చిన ప్రైవేట్ ట్రావెల్స్ డివైడర్ ను ఢీకొని రోడ్డుకు అడ్డంగా బోల్తా పడింది.

సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను పోలీసులు చిత్తూరు జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, పరిస్థితి విషమంగా ఉన్న మరికొందర్ని వేలూరు సీఎంసీ ఆసుపత్రి కి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
Also Read: AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ, మహిళలకు ఉచిత బస్సు సహా చర్చించే కీలక అంశాలివే