జడ్చర్ల: మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల పట్టణంలో దారుణం జరిగింది. తన ప్రేమను నిరాకరించిందనే కక్షతో ఓ ప్రేమోన్మాది యువతిపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి దారుణంగా హత్య చేశాడు. జడ్చర్లలోని ఒక ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్న యువతిని నిందితుడు గత కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే శనివారం నాడు ఆమె బస్సు దిగి నడుచుకుంటూ వెళ్తుండగా, ఒక్కసారిగా అడ్డుకట్ట వేసిన ప్రేమోన్మాది తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెను పలుమార్లు పొడిచాడు.  

Continues below advertisement

కత్తి దాడిలో యువతికి  పలుచోట్ల తీవ్ర గాయాలు కాగా, తీవ్ర రక్తస్రావం అయింది. యువతిపై కత్తి దాడిని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి ఆమెను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే పరిస్థితి విషమించడంతో ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ఈ దారుణ హత్య జడ్చర్లలో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

మరోవైపు, యువతిపై కత్తితో దాడి చేసి పారిపోవడానికి ప్రయత్నించిన ఆ ప్రేమోన్మాదిని స్థానికులు పట్టుకున్నారు. నిందితుడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అతడిని స్తంభానికి కట్టేసి చితకబాదారు. అనంతరం సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు.

Continues below advertisement

Also Read: Vikarabad Crime News: తాండూరులో మహిళలు మిస్సింగ్.. మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో మృతదేహాలు లభ్యం!

కానిస్టేబుల్‌కు 31 ఏళ్ల జైలు శిక్ష విధించిన పోక్సో ప్రత్యేక కోర్టు!హైదరాబాద్: రక్షణ కల్పించాల్సిన ఒక పోలీసు కానిస్టేబుల్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో న్యాయస్థానం చారిత్రాత్మక తీర్పునిచ్చింది. బోయిన్‌పల్లి సీఐ తిరుపతిరాజు వెల్లడించిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ మధ్య మండలంలో కానిస్టేబుల్‌గా పనిచేసిన వరదరాజ్‌ సుదేశ్‌ (39) అనే వ్యక్తి, 2020 లో తాడ్‌బండ్‌ ప్రాంతానికి చెందిన ఒక బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తనకు జరిగిన అన్యాయంపై బాధితురాలు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయడంతో, బోయిన్‌పల్లి పోలీసులు సదరు కానిస్టేబుల్‌పై పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

ఈ కేసుపై సుదీర్ఘంగా విచారణ జరిపిన సైఫాబాద్‌లోని హాకా భవన్‌లో ఉన్న పోక్సో ప్రత్యేక కోర్టు శుక్రవారం నాడు తుది తీర్పు వెలువరించింది. కానిస్టేబుల్ సుదేశ్ చేసిన నేరం పక్కా ఆధారాలతో రుజువు కావడంతో న్యాయమూర్తి నిందితుడికి 31 సంవత్సరాల కఠిన జైలు శిక్షను ఖరారు చేశారు. జైలు శిక్షతో పాటు నిందితుడికి రూ. 12 వేల జరిమానా కూడా విధించారు. అంతేకాకుండా, బాధితురాలైన బాలికకు రూ. 1 లక్ష పరిహారంగా చెల్లించాలంటూ న్యాయస్థానం నిందితుడిని ఆదేశించింది.

Also Read: Nepali Gang Arrest In Robbery Case: జవహర్‌నగర్‌ చోరీ కేసు ఛేదించిన పోలీసులు.. నేపాల్ బార్డర్‌లో దంపతులు అరెస్ట్