Rangareddy News : రంగారెడ్డి జిల్లా కొత్తూరులో హైటెక్ వ్యభిచారం గుట్టురట్టు చేశారు పోలీసులు. ఓ సర్పంచ్ ఇంట్లో వ్యభిచారం చేస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో  8 మంది యువకులు, ఒక యువతిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. యువతిని ఆన్లైన్ లో బుక్ చేసుకున్నట్లు సమాచారం. ఇంట్లో మద్యం, మందుబాటిళ్లు, కండోమ్ ప్యాకెట్ల కనిపించాయి. ఈ దాడుల్లో యువకుల వద్ద నుంచి  9 సెల్ ఫోన్లు, 3 కార్లు ,16000 క్యాష్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. యువకులు మహేశ్వరం మండలానికి చెందిన వారుగా గుర్తించారు. 


సర్పంచ్ ఇంట్లో సీక్రెట్ గా 


రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కొత్తూరులో వ్యభిచారం గుట్టురట్టైంది. సర్పంచ్ ఇంట్లో వ్యభిచారం చేస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (AHTU) పొలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 8 మంది యువకులు, ఒక యువతి పట్టుబడ్డారు. ఇంట్లో మద్యం, మందుబాటిళ్లు, కండోమ్ ప్యాకెట్లు దర్శనమిచ్చాయి. 


ఒక యువతి, 8 మంది యువకులు అరెస్టు


 మహేశ్వరం మండలం పరిధిలోని శుభన్ పూర్ గ్రామానికి చెందిన బొల్లు శ్రీకాంత్, పెద్దమ్మతండ గ్రామానికి చెందిన పాట్లవత్ రాజు,  చిన్న తుప్పర గ్రామానికి చెందిన నాగరాజు, మనసంపల్లి గ్రామానికి చెందిన పెండ్లిమడుగు నవీన్, నల్లచెరువు తండాకు చెందిన ధనుల రవి కలిసి వెస్ట్ బెంగాల్ కు చెందిన ఓ యువతినీ ఆన్లైన్ సంప్రదించారు. ఆ యువతిని హైదరాబాద్ లో కారులో పికప్ చేసుకుని రంగారెడ్డి జిల్లా  కొత్తూరు మున్సిపాలిటీ కేంద్రంలోని ఓ సర్పంచ్ ఇంట్లో ఉంచారు.  ఈ సమాచారం అందుకున్న పోలీసులు వ్యభిచారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 8 మంది యువకులు, ఒక యువతితో పాటు 3 కార్లు , 16 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కొత్తూరు సీఐ బాలరాజ్ తెలిపారు. 


రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ టీచర్లు


విద్యాబుద్ధులు నేర్పే గురువులే దారి తప్పారు. వివాహేతర సంబంధం నడుపుతున్న ఇద్దరు టీచర్లు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళ్తే ములుగు జిల్లా మంగపేట మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ లో ఫిజికల్ సైన్స్, బయోసైన్స్ స్కూల్ అసిస్టెంట్లుగా పని చేస్తున్న కుక్కల నాగేందర్, మరో టీచర్ కొంత కాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు. సదరు ఉపాధ్యాయురాలి భర్త మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఏఆర్ కానిస్టేబుల్ గా పని చేస్తున్నారు. అయితే వారి వివాహేతర సంబంధం గురించి తెలుసుకున్న కానిస్టేబుల్ ఈ తతంగంపై గతంలోనే ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేశారు. దీంతో సదురు ఉపాధ్యాయురాలిని జనవరిలో మంగపేట నుంచి కొత్త బెస్తగూడెం పాఠశాలకు డిప్యూటేషన్ పై పంపారు. అయినా తీరు మార్చుకోలేదు. ఇద్దరు వివాహేతర సంబంధం కొనసాగించారు. ఈ క్రమంలో ఉపాధ్యాయురాలి భర్త ఫిబ్రవరి 18వ తేదీన శివరాత్రి రోజు వేములవాడకు బందోబస్తు కోసం వెళ్లి వచ్చారు. 


"నేను వస్తున్నా.. తలుపు తీసి ఉంచు"


ఆయనకు సోమవారం సెలవు దినం కావడంతో భార్య, కూతురిని చూసేందుకు మంగపేటకు వచ్చారు. ఈ క్రమంలోనే నాగేందర్ సదరు ఉపాధ్యాయురాలి సెల్ కు ఫోన్ చేయగా.. కానిస్టేబుల్ లిఫ్ట్ చేశారు. అయితే హాలో అనకముందే.. ‘తాను వస్తున్నానని .. తలుపు తీసి ఉంచాలి’ అని చెప్పారు. దీంతో అప్రమత్తమైన కానిస్టేబుల్ భార్యకు విషయం చెప్పకుండా చివరి గదిని లాక్ చేసి.. ముందు తలుపులు తీసి ఉంచి బాత్రూమ్ లో దాక్కున్నాడు. ఉపాధ్యాయుడు రాత్రి ఇంటికి వచ్చి ఉపాధ్యాయుడు లోపలికి వెళ్లగానే బయటి నుంచి తాళం వేశారు. అనంతరం కొత్తగూడ మండలంలోని బంధువులకు, ఉపాధ్యాయులకు సమాచారం ఇచ్చారు. అనంతరం నాగేందర్, టీచర్ కు దేహశుద్ధి చేసి మండల కేంద్రంలో ఊరేగింపుగా తీసుకెళ్లి పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.