Ranga Reddy Crime News:: రోజురోజుకూ అమ్మాయిలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు ఎక్కవ అవుతున్నాయి. కాస్త అమాయకంగా కనిపిస్తే చాలు ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేస్తున్నారు. నచ్చినన్ని రోజులు మాట్లాడుతూ.. శారీరకంగా లొంగ దీసుకుంటూ కామ వాంఛ తీర్చుకుంటున్నారు. ఆపై మొహం చాటేస్తున్నారు. మరికొందరైతే బ్రేకప్ పేరుతో దూరం పెడుతున్నారు. ఇలాంటి ఘటనే తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రేమ, పెళ్లి పేరుతో దగ్గరై.. కోరిక తీర్చుకొని చెప్పకుండా పారిపోయాడు. విషయం తెలుసుకున్న యువతి లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించింది. అయితే ఈ ఘటన ఎప్పుడు, ఎలా జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 


రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ లో దారుణం జరిగింది. ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆపై అత్యాచారం చేశాడు. ముందుగా ప్రేమ, పెళ్లి పేరుతో దగ్గరైన మహమ్మద్ అలీ... ఆమెతో స్నేహం సాగించాడు. కొన్నాళ్ల తర్వాత మాయ మాటలు చెప్పి శారీరకంగా లొంగదీసుకున్నాడు. ఆ తర్వాత నుంచి మహమ్మద్ అలీ కనిపించకుండా పోయాడు. విషయం తెలియని బాధితురాలు అతడికి ఫోన్ చేసింది. ఫోన్ స్విచ్ఛాఫ్ రావడం, అతను కనిపించకుండా పోవడంతో మోసపోయినట్లు గ్రహించింది. వెంటనే రాజేంద్ర నగర్ పోలీసులను ఆశ్రయించింది. తనను పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పి, తనపై అత్యాచారానికి పాల్పడినట్లు తెలిపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మహమ్మద్ అలీ గురించి గాలిస్తున్నారు. 


పదో తరగతి విద్యార్థినిపై ఐదుగురు బాలుర అత్యాచారం


పదో తరగతి విద్యార్థినిపై అదే తరగతికి చెందిన ఐదురుగు విద్యార్థులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఏబీపీతో అధికారులు చెపిన వివరాల ప్రకారం.. హాయత్ నగర్ ఉన్నత పాఠశాలలో ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర్య దినోత్సవం నాడు జెండా వందనం కార్యక్రమం తరవాత బాలిక బాత్రూంకు వెళ్లింది. అదే సమయంలో ఆమె వెనుకే వెళ్లిన మిగతా ఐదుగురు బాలురు.. బాలికతో మాట్లాడుతూ నలుగురు అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారం చేసిన వీడియోని ఐదో విద్యార్థి సెల్ ఫోన్ లో రికార్డ్ చేశాడు. ఈ విషయాన్ని ఎవరితో అయిన చెబితే ఈ వీడియోని అందరికి చూపిచడంతో పాటు సోషల్ మీడియాలో పెడ్తానంటూ భయబ్రాంతులకు గురి చేశారు. దీంతో బాలిక ఎవరికి చెప్పకుండా తనలో తానే కుమిలిపోయింది. అయితే ఈ ఘటన లో అందరూ మైనర్ లే.  


వైరల్ అయిన వీడియోలు.. ఎట్టకేలకు విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు


ఘటన జరిగిన మరో 10 రోజుల తరువాత బాలికపై మరోసారి అత్యాచారానికి పాల్పడ్డారు. మళ్లీ సెల్ ఫోన్ లో చిత్రీకరించారు. అయితే ఐదో విద్యార్థికి అవకాశం ఇవ్వలేదని కోపంతో అతడు ఆ వీడియోలను 50 మందికి పంపాడు. అలా వైరల్ అయిన వీడియో బాలిక తల్లిదండ్రులకు వచ్చింది. దీంతో బాలికను నిలదీసి అడగ‌్గా బాలిక జరిగిందంతా తల్లిదండ్రులకు చెప్పింది. బాలిక తల్లిదండ్రులు న్యాయం కోసం స్థానిక కార్పొరేటర్ ను, పెద్దలను ఆశ్రయించిన ఫలితం దక్కకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలో దిగిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి, బాలికను బాలికల వసతి గృహంలో చేర్చారు.