Singareni Coal Mine Accident: పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి(Singareni) ఆండ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్టులో ఘోర ప్రమాదం జరిగింది. ఆర్జీ-3 బొగ్గు గని(Coal Mine) పై కప్పు కూలింది. ఈ ప్రమాదంలో బొగ్గు రాళ్ల కింద చిక్కుకున్న నలుగురు మృతి(Five died) చెందారు. వీరిలో అసిస్టెంట్ మేనేజర్, నలుగురు కార్మికులు మృతి చెందారు. మరో నలుగురు కార్మికులు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. గాయపడిన కార్మికులను చికిత్స కోసం రామగుండం ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ఘటనాస్థలికి రెస్క్యూ టీం, పోలీసులు చేరుకున్నారు. ఈ ప్రమాదంపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.  రెస్క్యూ టీం గనిలోకి దిగి సహాయచర్యలు చేపట్టింది. ఈ ప్రమాదానికి కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 



ఈ ప్రమాదంలో చిక్కుకున్న వారి వివరాలు :


తేజ(అసిస్టెంట్ మేనేజర్),


జాది వెంకటేశ్వర్లు(ఆపరేటర్),


రవీందర్(బదిలీ వర్కర్),


పిల్లి నరేష్(మైనింగ్ సర్దార్)


మీస వీరయ్య(సపోర్ట్ మెన్)


20 మీటర్ల రూఫ్ కూలింది


"సైడ్ రూఫ్ పడిపోయింది. ఒక 20 మీటర్ల వరకూ సైడ్ రూఫ్ పడిపోయింది. ఐదుగురు వాటి కింద ఉండిపోయారు. నలుగురు డౌట్, ఒకరు సైరన్ కొడుతున్నారు. బాగా పడిపోయింది. నేను అక్కడికి కొంచెం దూరంలో ఉన్నాను. ప్రమాదం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో జరిగింది." శ్రీనివాస్, ప్రత్యక్షసాక్షి 


"20 మీటర్ల మేర రూఫ్ వాల్ కూలిపోయింది. ఒక్కసారిగా కప్పు కూలింది. నేను కొద్ది గాయాలతో బయటపడ్డాను. 20 రోజుల క్రితం కూలిన ప్రాంతాన్ని రిపేర్ చేయటానికి వెళ్లాం. సపోర్ట్ విధుల్లోకి వెళ్లింది 6 గురు మాత్రమే." ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న కార్మికుడు వీరయ్య


గత ఏడాది ప్రమాదంలో నలుగురు మృతి 


గతేడాది మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ డివిజన్‌లోని ఎస్ఆర్పీ-3 బొగ్గు గనిలో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులు మృతి చెందారు. మృతుల కుటుంబాలకు సింగరేణి యాజమాన్యం రూ. కోటి ఆర్థిక సాయం ప్రకటించింది. మృతుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఈ ప్రమాదం జరిగిన కొద్దిరోజులకే మందమర్రి రీజియన్‌లోని కల్యాణి ఖని ఓపెన్ కాస్ట్ గనిలో జరిగిన ప్రమాదంలో మేనేజర్ మృతి చెందారు. బొగ్గు గనుల్లో వరుస ప్రమాదాలపై కార్మికులు ఆందోళన చెందుతున్నారు. 


Also Read: Basara IIIT News: బ్రేక్ పాస్ట్ లో కప్ప, బొద్దింక, బాసర ట్రిపుల్ ఐటీ మెస్ లో కలుషిత ఆహారం!