Raidurgam Fire Accident: హైదరాబాద్: నగరంలోని భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రాయదుర్గం పీఎస్ వద్ద హోటల్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగి భవనం మూడో అంతస్తు వరకు వ్యాపించినట్లు సమాచారం. సమాచారం అందుకున్న వెంటనే 4 ఫైరింజన్లు అక్కడికి చేరుకుని మంటల్ని అదుపులోకి తీసుకునేందుకు యత్నిస్తున్నారు. శనివారం ఉదయం 11.30 గంటల సమయంలో మంటలు మొదలై, నిమిషాల వ్యవధిలో హోటల్ రెండో అంతస్తు, మూడో అంతస్తుకు మంటలు వ్యాపించాయని రాయదుర్గం పోలీసులు తెలిపారు. ప్రాణాలు రక్షించుకునేందుకు టెర్రస్ పైకి చేరడంతో ప్రాణనష్టం తప్పిందని సమాచారం. 20 మంది దాకా అగ్ని ప్రమాదం జరిగిన భవనంలో చిక్కుకోగా, రెస్క్యూ టీమ్ వారిని రక్షించే ప్రయత్నం చేస్తోంది.
స్పందించిన డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్
నాలుగు ఫ్లోర్ లు ఉన్న ఈ భవనంలో రెండో అంతస్తులో చెలరేగిన మంటలు చెలరేగగా, మూడో అంతస్తుకు వ్యాపించాయని డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ శ్రీధర్ రెడ్డి తెలిపారు. మూడు ఫ్లోర్ లో యాక్షన్ గ్రూప్ సెక్యురిటి ఆఫీస్ ఉంది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి సకాలంలో చేరుకుని.. రెండో ఫ్లోర్ లో మంటలు వ్యాపించడంతో ప్రాణాలు రక్షించుకునేందుకు పై అంతస్తులోకి ఉద్యోగులు పరుగులు తీశారని చెప్పారు. పై అంతస్తులో మంటల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా కిందకు దింపి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. భారీగా పొగలు కమ్ము కోవడంతో లోపలికి వెళ్లలేని పరిస్థితి ఉందన్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు దర్యాప్తులో తేలుతుందన్నారు.
బిల్డింగ్‌లో గ్రీన్ బావర్చి హెటల్
రాయదుర్గంలోని గ్రీన్ బావర్చి హోటల్ భవనంలో అగ్ని ప్రమాదం ప్రమాదం జరగినట్లు తెలుస్తోంది. భవనంలో అగ్ని ప్రమాదం జరగడంతో ప్రాణాలు కాపాడుకునేందుకు టెర్రస్ మీదకు ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. 20 మంది దాకా అగ్ని ప్రమాదం జరిగిన పై అంతస్తులో చిక్కుకుపోయారు. క్రేన్ల సహాయంతో రెస్క్యూ టీమ్ భవనంలో చిక్కుకున్న వారిని రక్షిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కావడం వల్లే అగ్ని ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. మంటలు అదుపులోకి వచ్చినట్లు తెలుస్తోంది. మరో గంట రెండు గంటల్లో భవనంలో చిక్కుకున్న మిగతా వారిని సైతం సురక్షితంగా బయటకు తీసి, రెస్క్యూ ఆపరేషన్ పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు.
Also Read: Anantapur: తెల్లవారుజామున విషాదం, గ్యాస్ సిలిండర్ పేలి కుటుంబానికి చెందిన నలుగురు మృతి