మహారాష్ట్రలోని పుణెలో నదిలో విసిరిన గోనె సంచిలో 62 ఏళ్ల వృద్ధురాలి శరీర భాగాలు దొరికిన హత్య కేసును పుణె పోలీసులు ఛేదించారు. గత నెలలో ఈ దారుణ ఘటన జరిగింది. పోలీసులు చాలా సమయం తీసుకొని ఈ కేసు గుట్టు విప్పగా, అసలు విషయం తెలిసి అంతా నిర్ఘాంతపోయారు. మొత్తానికి తాజాగా మహిళ హత్య కేసులో నిందితులని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నిందితులు మరెవరో కాదు, చనిపోయిన వృద్ధురాలి కొడుకు, మనవడు. ఇద్దరూ కలిసి ఆమెను హత్య చేసి మృతదేహాన్ని రంపపు యంత్రంతో ముక్కలు ముక్కలు చేసి నదిలో పడేశారు.
ఈ మేరకు మంగళవారం ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఓ పోలీసు అధికారి విలేకరుల సమావేశంలో పుణెలో వెల్లడించారు. నిందితులను మృతుడి కుమారుడు సందీప్ గైక్వాడ్, అతని మనవడిగా గుర్తించారు. చనిపోయిన ఉషా గైక్వాడ్‌ను ఇంటి నుంచి వెళ్లిపోవాలని కోరడం, ఆమె వెళ్లకపోవడంతో కోపంతో తండ్రీకూతుళ్లు ఈ నేరానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.
వృద్ధురాలు కనిపించడం లేదని నిందితులు ఫిర్యాదు
ఆగస్ట్ 5న ఉషా గైక్వాడ్ అదృశ్యంపై ముధ్వా పోలీస్ స్టేషన్‌లో మహిళ మనవడు, కుమారుడు సందీప్ చాకచక్యంగా ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు. మరోవైపు, మృతురాలి కుమార్తె శీతల్ కాంబ్లే కూడా ఉషా గైక్వాడ్ అదృశ్యం వెనుక సందీప్ సహా అతని కొడుకు ఇద్దరూ ఉన్నారని పేర్కొంటూ పోలీసులకు ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. సందీప్‌తో పాటు అతని కుమారుడిని అదుపులోకి తీసుకున్నామని, కేశవ్ నగర్ ప్రాంతంలో ఆ పెద్దావిడకు సొంత ఇల్లు, బంగారు ఆభరణాలు ఉండడంతో వాటి విషయంలో బాధితురాలిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తమ విచారణలో తేలిందని కేసును విచారిస్తున్న అధికారి తెలిపారు.
కళేబరాలను ఎలక్ట్రిక్ కట్టర్ మెషీన్‌తో కత్తిరింపు
నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు మృతురాలి మనవడు.. ఆమెను గొంతుకోసి హత్య చేసినట్లు అధికారి తెలిపారు. సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు ఎలక్ట్రిక్ కట్టర్ మెషిన్ కొని ఆమె మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికేశాడు. ఓ గోనె సంచిలో మహిళ మృతదేహం ముక్కలను నింపారు. ఆ తర్వాత ఆ సంచిని వారు నదిలో పడేశారు. ఆగస్టు 23న వీరు నదిలో విసిరేసిన శవపు ముక్కల సంచి తూర్ అనే ప్రాంతం సమీపంలో ఒడ్డున తేలుతూ కనిపించింది.
స్థానికులు ఆ విషయం గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఆ తర్వాత పోలీసులు విచారణ ప్రారంభించారు. ప్రస్తుతం నిందితులుగా ఉన్న తండ్రీకొడుకులపై హత్య, సాక్ష్యాలను ధ్వంసం చేసిన నేరాలకు సంబంధించిన సెక్షన్లపైన కేసు నమోదు చేశారు.
టీవీ ఆఫ్ చేసినందుకు అత్త వేళ్లు కొరికిన కోడలు
మహారాష్ట్రలోని తానే జిల్లాలో వింత ఘటన చోటు చేసుకుంది. 60 ఏళ్ల వృశాలి కులకర్ణి అనే ఓ వృద్ధ మహిల ఇంట్లో దేవుడికి భజన చేస్తోంది. ఈ క్రమంలోనే ఆమె 32 ఏళ్ల కోడలు విజయ టీవీ చూస్తుంది. అయితే టీవీ సౌండ్ ఎక్కువగా పెట్టడంతో.. తగ్గించమని అత్తగారు పదే పదే కోరారు. అయినప్పటికీ ఆమె వినకపోవడంతో అత్తగారు వచ్చి టీవీ ఆఫ్ చేశారు. దీంతో కోపోద్రిక్తురాలైన విజయ అత్తగారి మూడు వేళ్లను కొరికేసింది. అయితే ఆపేందుకు వచ్చిన భర్తను కూడా చెప్పుతో కొట్టింది. అయితే వేళ్లకు గాయమవడంతో ఆమె కుమారుడు వెంటనే ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అదృష్ట వశాత్తు అత్తగారి వేళ్లు తెగలేదని వైద్యులు తెలిపారు. చికిత్స అనంతరం అత్తగారు వృశాలి శివాజీ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.