Pune man kills father after being told to switch off TV:  మహారాష్ట్ర పూణేలోని కోథ్రుడ్ ప్రాంతంలో ఒక వ్యక్తి తన తండ్రిని కొట్టి చంపేసిన ఘటన సంచలనం సృష్టించింది.  టీవీ ఆఫ్ చేయమని, కళ్ళలో ఐ డ్రాప్స్  వేయమని   తండ్రి చెప్పడంతో ఆగ్రహానికి కొడుకు  కర్ర తీసుకుని కొట్టి చంపేశాడు. గురువారం రాత్రి జరిగిన ఈ హత్యకు సంబంధించి సచిన్ పోలీసులకు స్వయంగా లొంగిపోయాడు. 

అక్టోబర్ 2 వతేదీ రాత్రి కోథ్రుడ్‌లోని వాస్తు భవన్‌లో   తానాజీ పైగుడేతో కలిసి కుమారుడు సచిన్ నివసిస్తున్నాడు.  , ఇంట్లోనే ఉండే వృద్ధుడు, ఇటీవల కళ్ళ నొప్పితో డాక్టర్‌ను సంప్రదించి ఐ డ్రాప్స్ తీసుకున్నాడు. ఆ రోజు రాత్రి సచిన్ టీవీ చూస్తున్నాడు. ఆ సమయంలో  సచిన్‌కు టీవీ ఆఫ్ చేసి తన కళ్లల్లో డ్రాప్స్ వేయమని కోరాడు.  సచిన్ దాన్ని తిరస్కరించడంతో వాదన మొదలైంది. కోపం చెలరేగిన సచిన్ కిచెన్ నుంచి  కర్ర  తీసుకుని తండ్రి మీద దాడి చేశాడు.   అనేక చోట్ల కొట్టి, తానాజీని తీవ్రంగా గాయపరిచాడు.

బాధతో విలవిల్లాడుతున్న తండ్రిని సచినే ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అియేత  ఆసుపత్రికి  చేరుకునేసరికి తానాజీ మరణించాడు. ఈ ఘటన ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. సచిన్ తన చేతిలో రక్తం తడిసిన కర్రను స్వాధీనం చేసుకున్నారు. తానే హత్య చేసినట్లుగా సచిన్ అంగీకరించాడు.  వాదన చిన్న విషయం నుంచి మొదలైంది. సచిన్ మానసిక స్థితి గురించి దర్యాప్తు చేస్తున్నామని పోీలసులు తెలిపారు. సచిన్ ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. తల్లి మరణించిన తర్వాత తండ్రి-కుమారుడు ఇద్దరే ఇంట్లో ఉండేవారు. ఈ ఘటనపై పోలీసులు సాక్షుల వాంగ్మూలాలు, మెడికల్ రిపోర్టులు సేకరిస్తున్నారు. పూణేలో ఇలాంటి కుటుంబ హింసా ఘటనలు పెరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. "చిన్న విషయాలు పెద్ద సమస్యలుగా మారుతున్నాయి. మానసిక సహాయం అవసరం" అని  ప్రజలు అభిప్రాయపడుతున్నారు. హారాష్ట్ర పోలీసు డైరెక్టర్‌జనరల్ "కుటుంబాల్లో కౌన్సెలింగ్ ప్రోగ్రామ్‌లు పెంచాలి" అని ఆలోచిస్తున్నారు.