గుడివాడలో ( Gudivada ) మట్టి మాఫియా చేతిలో దాడికి గురైన రెవిన్యూ ఇన్స్‌పెక్టర్ అరవింద్‌పై ( Attack On RI ) పోలీసులు కేసులు నమోదు చేశారు.ఆర్ఐ, రెవెన్యూ సిబ్బంది లంచం డిమాండ్ చేస్తూ.. తమపై దాడికి దిగారని మట్టి మాఫియా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆర్ఐ అరవింద్‌పై సెక్షన్ 323, 506, 384, రెడ్ విత్ 511 కింద కేసులు నమోదు చేశారు. దాడి ఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత ఇలా బాధితుడైన ఆర్‌ఐపైనే ఎదురు కేసులు నమోదు చేయడం కలకలం రేపుతోంది. 


గోడల్లో వెండి..రహస్య అరల్లో నోట్ల కట్టలు ! ఈ రోజుల్లోనూ సినిమా టెక్నిక్కే ఫాలో అయ్యాడు.. అడ్డంగా బుక్కయ్యాడు !


ఐదు రోజుల కిందట గుడివాడ మండలం, మోటూరు ( MOturu Village ) గ్రామంలో జరుగుతున్న అక్రమ తవ్వకాలను అడ్డుకున్న రెవెన్యూ అధికారులపై మైనింగ్ మాఫియా దాడికి తెగబడింది. రెవెన్యూ అధికారిని జేసీబీతో తొక్కించేందుకు యత్నించింది. మాదీ మంత్రి కొడాలి నాని ముఖ్య అనుచరునిగా భావిస్తున్న గంటా సురేష్ ఆధ్వర్యంలో ఈ దాడి జరిగినట్లుగా ఆరోపణలు వచ్చాయి. దాడిలో సురేష్ ( Ganta Suresh )  సోదరుడు కల్యాణ్ పాల్గొన్న దృశ్యాలున్నాయి. ఆర్‌ఐపై జేసీబీతో తొక్కించేందుకు ప్రయత్నించారు. వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 


అక్క జోలికి రావద్దని జిమ్‌ ట్రైనర్‌కు ఓ యువకుడి వార్నింగ్- తెల్లారే సరికి డెడ్‌ బాడిగా మారిన కుర్రాడు


ఆర్ఐ అరవింద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు  మొత్తం 10 మందిపై 353, 307 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటివరకు 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. 
ఈ ఘటనకు సంబంధించి ఒక  జేసీబీ, 3 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు ప్రకటించారు.- ప్రభుత్వ  అధికారుల విధులకు ఆటంకం కలిగించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న  గంటా సురేష్‌ను ఇప్పటి వరకూ అరెస్ట్ చేయలేదు. 


చనిపోయిందని ఏడ్చారు కానీ మమ్మీ రిటర్న్స్ ! ఈవిడ కథలో స్టన్నింగ్ సీక్రెట్స్


ఈ లోపు మట్టి మాఫియానే ఎదురు ఫిర్యాదు చేయడంతో ఆర్‌ఐపై ( Case On RI Aravind ) కేసు నమోదు చేయడంపై ఉద్యోగుల్లోనూ విస్మయం వ్యక్తమవుతోంది. ఎలాంటి ఆధారాల్లేకుండా తమపై ఫిర్యాదు చేస్తే కేసులు పెట్టడం ఏమిటని ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే కేసు ఉపసంహరణకు ఆర్ఐ ఆనంద్ నిరాకరించడంతోనే .. మట్టి మాఫియా ఎదురు కేసుసు పెట్టిందన్న ప్రచారం గుడివాడలో జరుగుతోంది.