Pension Money Lost In Proddutur: రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ పంపిణీ ముమ్మరంగా సాగుతున్న వేళ వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో (Proddutur) పెన్షన్ సొమ్ము పోవడం కలకలం రేపింది. ప్రొద్దుటూరు ఏడో వార్డు సచివాలయం పరిధిలో రూ.4 లక్షల పింఛన్ సొమ్ము మాయమైంది. దుండగులు తన వద్ద నుంచి డబ్బులు దోచుకెళ్లారని సచివాలయ కార్యదర్శి మురళి తెలిపారు. సోమవారం ఉదయం పింఛన్ సొమ్ము పంపిణీ చేసేందుకు వెళ్తుండగా.. స్పృహ తప్పి బైక్ మీద నుంచి కింద పడిపోయానని అన్నారు. ఈ క్రమంలో తన వద్ద ఉన్న డబ్బుల బ్యాగును ఎవరో ఎత్తుకెళ్లారని పోలీసులకు చెప్పారు. దీంతో అతన్ని ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రికి తరలించిన పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే, పింఛన్ సొమ్ము మాయం కావడంపై పోలీసులు, పురపాలక అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ ప్రాంతంలో సీసీ ఫుటేజీ పరిశీలిస్తున్నారు.