Warangal prostitution Rocket: మైనర్ బాలికలకు ఇన్ స్టాలో మాయమాటలు చెప్పి వారిని వ్యభిచార వృత్తిలోకి దింపుతున్న ముఠాను వరంగల్ పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు దాడి చేసిన సమయంలో ఆ ఇంట్లో కొన్ని వందల కండోమ్ ప్యాకెట్లు లభించాయి. దీన్ని బట్టి వారు చాలా పెద్ద స్థాయిలో వ్యభిచారం రాకెట్ నడుపుతున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఓ మైనర్ బాలికను కిడ్నాప్ చేశారన్న ఫిర్యాదు రావడంతో దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులు ఆ అమ్మాయితో వ్యభిచారం చేయిస్తున్నారని గుర్తించారు. వెంటనే వారి డెన్ పై దాడి చేసి ..అరెస్టు చేశారు. 

మైనర్ బాలిక అదృశ్యంపై 11న కేసు నమోదు 

మార్చి  11వ తేదిన మైనర్‌ బాలిక కనిపించడం లేదని వచ్చిన ఫిర్యాదుపై మిల్స్‌ కాలనీ పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణలో  బాలికను ములుగు క్రాస్‌ రోడ్డు వద్ద గుర్తించారు. పోలీసులు ఆ బాలికను ప్రశ్నించడంతో చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి.  తనను కొంత మంది వ్యక్తులు అపహరించి, గంజాయి పీల్చేలా చేసి అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులకు తెలిపింది.   అప్రమత్తమైన పోలీసులు పోలీస్‌ కమిషనర్‌ అదేశాల మేరకు  సెంట్రల్‌ డిసిపి షేక్‌ సలీమా పర్యవేక్షణలో  వరంగల్‌ ఏసిపి అధ్వర్యంలో మూడు ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసి నిందితులను పట్టుకున్నారు. వారిని ప్రశ్నించడంతో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. 

మైనర్ బాలికల్ని ట్రాప్ చేసి వ్యభిచారం చేయించడమే వారి పని 

ఈ వ్యవహరంలో ప్రధాన నిందితురాలైన ముస్కు లత, ల్యాదేళ్ళ గ్రామంలో వ్యభిచార వృత్తిని కొనసాగిస్తూ వస్తున్నారు. తల్లిదండ్రులు మరణించడంతో మరో మైనర్‌ నిందితురాలికి తన ఇంటిలోనే ఆశ్రయం కల్పించింది. ప్రధాన నిందితురాలు వ్యభిచార వృత్తి కొనసాగిస్తుండంతో తన వృత్తిలో అవసరమైన కొత్త మహిళలు లేదా బాలికలను తీసుకొచ్చేందుకు బాలికకు బాధ్యతలు అప్పగించింది. సోషల్ మీడియాలో లేదా బయట ట్రాప్ చేసి తీసుకు వస్తే  బాగా డబ్బులు వస్తాయని ఆశ పెట్టింది. దీంతో  మైనర్‌ నిందితురాలు తన స్నేహితరాలితో పరిచయమున్న బాధిత బాలికను లక్ష్యంగా చేసుకొని ఇంస్టాగ్రాం ద్వారా బాధిత బాలికతో పరిచయం పెంచుకుంది.  బాలిక స్కూల్‌ వెళ్ళే సమయంలో నిందితురాలు బాధిత బాలికను కలిసేది. డబ్బులు ఆశ పెట్టేది. అదే సమయంలో గంజాయి కూడా అలవాటు చేసంది. నమ్మకం కలిగేందుకు బాలికకు షాపింగ్‌ మాల్స్‌కు తీసుకవెళ్ళి బట్టలను ఇప్పించడంతో వీరిపై నమ్మకం కలగడంతో సదరు బాధిత బాలిక వీరిని నమ్మి ఈ నెల 11వ తేదిన  మరో ఇద్దరు నిందితులైన షేక్‌సైలాని బాబా, మహ్మద్‌ అల్తాఫ్‌లతో కలిసి కారులో  వారితో పాటు వెళ్లింది. 

అత్యాచారం చేసిన నిందితులు 

 మీర్జా ఫైజ్‌ బేగ్‌ అనే వ్యక్తి వద్ద గంజాయిని కొనుగొలు చేసి నర్సంపేట శివారు ప్రాంతంలో నిందితుల్లో  బాలికను తీసుకవెళ్ళి అత్యాచారానికి పాల్పడ్డాడు.   అత్యాచారం చేసేది  సెల్‌ఫోన్లో చిత్రికరించామని తాము చెప్పినట్లుగా చేయకపోతే బయటపెడతామని హెచ్చరించి..తర్వాత రోజు ఉదయం  మైనర్‌ బాలికను ములుగు క్రాస్‌ రోడ్డు వదిలి అక్కడి నుండి పారిపోయారు.పోలీసులకు విషయం తెలియడంతో  వారి డెన్ పై పోలీసులు దాడి చేశారు. వారి ఇంట్లో  ఒక కిలో ఎనిమిది వందల గ్రాముల గంజాయితో పాటు ఒక కారు, 75వేల రూపాయల నగదు, నాలుగు సెల్‌ ఫోన్లతో పాటు ప్రధాన నిందితురాలి ఇంటి వద్ద భారీ స్థాయిలో కండోమ్‌ ప్యాకేట్లను స్వాధీనం చేసుకున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌ సింగ్‌ చెప్పారు. అరెస్ట్ అయిన నిందితులు నగర సమీపంలో , ల్యాదేళ్ళ గ్రామానికి చెందిన ముస్కు లత, వరంగల్ జిల్లాకు చెందిన మైనర్‌ బాలిక, వరంగల్‌ శంభుని పేటకు చెందిన అబ్దుల్‌ అఫ్నాన్‌, షేక్‌సైలాని బాబా, మహ్మద్‌ అల్తాఫ్‌, మీర్జా ఫైజ్‌ బేగ్‌ ఆలియాస్‌ వదూద్‌ లను అన్నారు.