Kidnapping gang in Tirupati : స్నేహితులు అందరికీ ఉంటారు. కానీ మిత్రుడు కుటుంబం దగ్గర డబ్బులు ఉంటాయని తెలిసి వారిని కిడ్నాప్ చేసి డబ్బులు కొట్టేయాలనుకునే వాళ్లు మాత్రం అరుదుగా ఉంటారు. అలాంటి ఓ ముఠాను తిరుపతి పోలీసులు పట్టుకున్నారు. 

తిరుపతిలో కిడ్నాప్ కేసు చేధించిన పోలీసులు   మార్చి 28,29, కాసరం రాజేష్ కుటుంబం కిడ్నాప్ కిడ్నాప్ అయింది. ఈ కేసును చాలెంజింగ్ గా తీసుకున్న పోలీసులు నిందితుల్ని అరెస్టు చేశారు.    ఆరుగురు అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఆ నిందితులు ఎవరో కాదు.. ఆ కుటుంబానికి తెలిసిన వాళ్లే.  కాసరం రాజేష్ , భార్గవ్,అరుణ్ కుమార్ స్నేహితలు. తిరుపతిలోని జీవకోనకు చెందిన రాజేష్ బీమా ఏజెంట్‌గా పనిచేస్తూ మీసేవా కేంద్రాన్ని నడుపుతున్నాడు. అతను తన తల్లి విజయలక్ష్మి, భార్య సుమతి, కుమార్తెలు యోషిత, జష్మితలతో నివసిస్తున్నాడు. రాజేష్ తన చిన్ననాటి స్నేహితుడు భార్గవ్‌తో ఆర్థిక లావాదేవీలు నిర్వహించాడు, అతను దాదాపు 24 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు కానీ వాటిని తిరిగి ఇవ్వలేదు.

ఇటీవల  కాసరం రాజేష్ తల్లికి 1.5 కోట్ల ధనం వస్తుందని తెలుసుకున్న మిత్రులు వారి కుటుంబాన్ని కిడ్నాప్ చేయాలని నిర్ణయించుకున్నారు. అప్పటికే ఆ కుటుంబం వద్ద స్నేహితులు 24 లక్షల అప్పు తీసుకున్నారు.  24 లక్షల రూపాయలు ఇస్తానని నమ్మబలికి  కుటుంబాన్ని పిలిపించి కిడ్నాప్ చేశారు.  

నిందితుల్ని అరెస్టు చేసిన పోలీసులు         

తన స్నేహితులు కుట్రలు చేస్తున్నారని పని పసిగట్టిన రాజేష్..  కిడ్నాప ర్ల నుండి  తిరగబడి అయితే పల్లె వద్ద తప్పించుకొని 100 కాల్ చేశాడు.  అప్రమత్తమైన కిడ్నాపర్లు చిత్తూరు వద్ద రాజేష్ తల్లిని వదిలిపెట్టి, కుటుంబాన్ని మరొక చోట వదిలేసి పారిపోయారు.  బాధితుడు  రాజేష్ ఫిర్యాదు మేరకు  కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులకు కీలక విషయాలు తెలిసాయి.  కిడ్నాపర్లను రేణిగుంట-కడప మార్గంలోని కుక్కల దొడ్డివద్ద అరెస్టు చేశారు .   అరుణ్ కుమార్. దామతోటి సాయి కుమార్,  బలిపాకు మణికంఠ,  చీరాల ప్రకాష్,  గణేష్  అనే వారిని అరెస్టు చేశారు.                            

కిడ్నాపర్లు చాలాపక్కా ప్లాన్తో వచ్చారు.  మత్తును కలిగించే ఇంజక్షన్లు ఉన్నట్లు గుర్తించారు. అయితే వారిని గుర్తించలేదు.  ఈ కేసులో కిలక నిందితుడిగా ఉన్న అరుణ్ కుమార్ పై ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో మర్డర్ కేసు, వారణాసి ఎటిఎం కేసు, రామకుప్పం,సంబేపల్లి లో కిడ్నాప్  కేసులు వున్నాయి. భార్గవ్ పై ఈస్ట్ పోలీస్ స్టేషన్ లోమర్డర్ కేసు, రామకుప్పం కిడ్నాప్ కేసు వుంది.సాయికుమార్ పై దొంగతనం కొట్లాట కేసులు ఉన్నాయి. వీరందరూ పాత నేరస్తులే కావడంతో వేగంగా పట్టుకున్నారు. అందుకే మిత్రుల్ని కూడా పరిమితంగా నమ్మాలని ఇలాంటి ఘటనలు నిరూపిస్తున్నాయి.