పెద్దపల్లి జిల్లా మంథనిలో దారుణం చోటు చేసుకుంది. కన్న కూతురిని అతి కిరాతకంగా తండ్రి నరికి చంపిన ఘటన పెద్దపెల్లి జిల్లాలో సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళ్తే, మంథని మండలం భట్టుపల్లి గ్రామంలో కన్న కూతురు రజిత (10)ను తండ్రి గుండ్ల సదయ్య గొడ్డలితో నరికి చంపాడు. అయితే, గత కొంత కాలంగా సదయ్య మానసిక స్థితి సరిగా లేక గ్రామంలో జనాలపై తరచుగా దాడులు చేస్తున్నాడని స్థానికులు తెలిపారు. కూతురిని చంపిన తర్వాత అదే గ్రామానికి మరో వ్యక్తి దూపం శ్రీనివాస్ పై కూడా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.