Cases on influencers:  బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తూ అనేక మంది ఆత్మహత్యలకు కారణం అవుతున్న వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పటికే బయ్యా సన్నీ యాదవ్, హర్ష సాయిలపై కేసులు పెట్టారు. తాజాగా పలువురు నటులు, ఇన్ ఫ్లూయన్సర్లపైనా కేసులు పెట్టారు. వీరిలో విష్ణుప్రియ, టేస్టీ తేజ వంటి బిగ్ బాస్‌లో పాల్గొన్న  యూట్యూబర్లు ఉన్నారు. సురేఖ వాణి కుమార్తె సుప్రీత, రీతూ చౌదరి, పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ పై కూడా కేసులు పెట్టారు.   యాంకర్ తో పాటు వైఎస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధిగా ఉన్న శ్యామలపై కూడా కేసు నమోదు చేశారు. వీరందరికీ అరెస్టు ముప్పు పొంచి ఉంది. 



ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేశారన్న కారణంగా విశాఖకు చెందిన లోకల్ బాయ్ నాని అనే యూట్యూబర్ అను అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు. అప్పటి నుంచిచాలా మంది సెలబ్రిటీలు తాము ఇక బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయబోమని ప్రకటనలు చేస్తూ వస్తున్నారు.  బెట్టింగ్ యాప్స్ విషయంలో సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జనార్ పోరాటం చేస్తున్నారు ..ఆయనే ప్రతీ రోజు అవగాహన కల్పిస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపై కేసులు పెట్టాలని సూచిస్తుననారు. దీంతో పోలీసులు గట్టి చర్యలు తీసుకుంటున్నారు.  



విశాఖలో లోకల్ బాయ్ నానిని అరెస్టు చేసినట్లుగా ఈ ఇన్ ఫ్లూయన్సర్లను కూడా అరెస్టు చేసి రిమాండ్ కు తరలించే అవకాశం ఉంది. కేసులు నమోదైన వారిలో చాలా మంది ఇప్పటికే తెలియక చేశామని.. ఇక నుంచి  చేయబోమని క్షమాపణలు వేడుకున్నారు. వైసీపీ అధికార ప్రతినిధి ఆరే శ్యామల మాత్రం ఇంకా క్షమాపణలు చెప్పలేదు. ఫేక్ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయడం వల్ల లక్షలు సంపాదిస్తున్న వీరు ఎన్నో కుటుంబాలు నాశనమవడానికి కారణం అవుతున్నారన్న ఆరోపణలు ఆరోస్తున్నాయి