Virginity Test : ఎవరైనా పెళ్లి చేసుకోవాలంటే మనసులు కలవాలి. పెద్దలు కుదర్చిన పెళ్లయినా కొన్ని విషయాలు మాట్లాడుకోరు. కానీ రాజస్థాన్‌లో మాత్రం ఓ కుటుంబం తమ ఇంటికి కోడలిగా వచ్చిన ఓ యువతిని మాత్రం ముందుగా కన్యత్వ పరీక్షలు చేయించుకోవాలన్నారు. తొలి రాత్రే కన్యత్వాన్ని నిరూపించుకోవాలని షరతు పెట్టారు. ఆమె వారి ఒత్తిడికి తలొగ్గింది. తప్పు చేయలేదన్న ధీమాతో కన్యత్వ పరీక్ష చేయించుకుంది. అయితే పరీక్షలో ఫెయిల్ అయింది. దీంతో ఆమె జీవితం తల కిందులు అయింది.
పెళ్లయిన మొదటి రాత్రే కన్యత్వ పరీక్ష
రాజస్థాన్ బాగోర్‌లో 24 ఏళ్ల యువతికి ఈ ఏడాది మే 11న వివాహమైంది. పెళ్లైన తర్వాత తొలిరాత్రి రోజే ఆమెకు కన్యత్వ పరీక్ష నిర్వహించారు. పెద్దలు పట్టుబట్టడంతో యువతి కుటుంబసభ్యులు కూడా అంగీకరించారు. సాన్సీ తెగకు చెందిన ఈ కుటుంబాల్లో కుకడీ అనే ఆచారం కింద పెళ్లైన నవ వధువుకు కన్యత్వ పరీక్ష నిర్వహిస్తారు. ఫెయిలయితే భారీ జరిమానా విధిస్తారు. ఈ పరీక్షలో ఆమె ఫెయిలయినట్లుగా వైద్యులు తేల్చారు. ఈ విషయాన్ని వరుడు తన కుటుంబ సభ్యులకు తెలిపాడు. దీంతో అత్తమామలు, భర్త ఆమెను వేధింపులకు గురి చేశారు. చివరికి పంచాయతీ పెట్టాలని నిర్ణయించారు.
పంచాయతీ పెట్టించి రూ. పది లక్షల ఫైన్ విధింపు
బాగోర్‌లోని ఓ దేవాలయం వద్ద వరుడి కుటుంబ సభ్యులు పంచాయతీ నిర్వహించారు. వధువు కన్యత్వ పరీక్షలో ఫెయిలైందని పంచాయతీ పెద్దలకు చెప్పారు. పంచాయతీ పెద్దలు బాధితురాలికి అండగా నిలవాల్సింది పోయి రూ. 10 లక్షలు జరిమానా విధించారు. అంత డబ్బు తాను చెల్లించలేనని వధువు తేల్చి చెప్పింది. కుటుంబసభ్యులూ కన్నీరుమున్నీరయ్యారు. అయితే డబ్బు తేవాల్సిందేనని అత్తమామలు వేధింపులు ఆపకపోతూండటంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. భర్తతో పాటు అత్తమామలను పోలీసులు అరెస్టు చేశారు.
పెళ్లికి కొద్ది నెలల ముందే యువతిపై అత్యాచారం - కేసు నమోదు
నిజానికి ఆ యువతి అత్యాచార బాధితురాలు. పెళ్లికి కొద్ది నెలల ముందు పొరుగింటి యువకుడు తనపై అత్యాచారం చేశాడు. ఈ ఘటనపై పోలీసు స్టేషన్‌లో కేసు కూడా నమోదయింది. ఈ విషయం తెలిసి కూడా యువతిని తమ ఇంటి కోడలిగా తెచ్చుకున్నారు. తెలిసి కూడా కన్యత్వ పరీక్,।ను చేయించారు.చివరికి జరిమానా పేరుతో అదనపు డబ్బులు గుంజడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
బాధితులకే నష్టం చేసేలా పంచాయతీ పెద్దల తీర్పులు
రాజస్థాన్‌తో పాటు పలు రాష్ట్రాల్లోని కొన్ని తెగల్లో ఇలాంటి తీర్పులను పంచాయతీ పెద్దలుఇస్తూంటారు. అలాంటివాటికి ఎలాంటి చట్టబద్ధత ఉండదు. కానీ గ్రామ పెద్దలు కాబట్టి చెప్పినట్లుగా పాటిస్తూ ఉంటారు. అయితే ఇలాంటి పంచాయతీల్లో బాధితులకే ఎక్కువ నష్టం జరుగుతూ ఉంటుంది.
మోదీని దించేందుకు నితీశ్ బిజీబిజీ- ఆ విషయంపై క్లారిటీ ఇచ్చిన బిహార్ సీఎం