ప్రస్తుత రోజుల్లో మోసాలు పెరిగిపోతున్నాయి. ఇలా కూడా జరుగుతుందా అని ఆశ్చర్యపడేంతలా టెక్నాలజీ అండతో మాయగాళ్లు రెచ్చిపోతున్నారు.  అందుకే కొన్ని కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. మన కార్డులు మన దగ్గర ఉండగానే … నకిలీవి సృష్టించేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మన దగ్గరున్న పాన్ కార్డ్ అసలుదా కాదా అన్నిది తెలుకోవాల్సిన అవసరం ఉంది.




ఆధార్ కార్డు, రేషన్ కార్డులా పాన్ కార్డ్ కూడా కీలకమైన డాక్యుమెంట్లలో ఒకటి. అందుకే ప్రతి ఒక్కరికీ పాన్ కార్డ్ తప్పనిసరైపోయింది. అప్పట్లో పాన్ కార్డ్ కోసం అప్లై చేసుకోవాలంటే పెద్ద ప్రాసెస్ ఉండేది. కనీసం 45 రోజులు పట్టేది. కానీ ఇప్పుడైతే ఆధార్ కార్డ్ ఉంటే చాలు నిముషాల్లో పాన్ కార్డు పొందొచ్చు. NSDL, UTIITSL వెబ్‌సైట్ల ద్వారా పాన్ కార్డు కోసం అప్లై చేయొచ్చు. అయితే పాన్ కార్డు ఇంటికి రావాలంటే వారం రోజులు పడుతుంది.


ఇప్పటికే పాన్ కార్డు ఉన్నవాళ్లు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే… మోసగాళ్లు ఫేక్ పాన్ కార్డుల ద్వారా చెలరేగిపోతున్నారు. అందుకే ఈవిషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. మీ పాన్ కార్డు నిజమైందా? కాదా? అని సులభంగానే తెలుసుకోవచ్చు. ముందుగా ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌ వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి.  అక్కడ వెరిఫై పాన్ అనే ఆప్షన్ ఉంటుంది. దీనిపై క్లిక్ చేసి పాన్ నెంబర్, పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే.. ఆ పాన్ నెంబర్ మనుగడలో ఉందో లేదో తెలిసిపోతుంది. ఈ లింక్ ద్వారా మీ పాన్ కార్డు నిజమైందో కాదో తెలుసుకోవచ్చు.


పాన్ కార్డ్ వెరిఫికేషన్ కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి….


https://eportal.incometax.gov.in/iec/foservices/#/pre-login/verifyYourPAN






దేశంలో ప్రతి పన్ను చెల్లింపుదారుడు పన్ను పరిధిలో ఉన్న జీతం పొందడం, మ్యూచువల్ ఫండ్స్ కొనడం లేదా పెట్టుబడి పెట్టడం లాంటి ఏదైనా ఆర్థిక లావాదేవీలు చేయడానికి పాన్ కార్డు కలిగి ఉండాలి. పాన్ కార్డు ఆధారంగా అన్ని ఆర్థిక లావాదేవీలను ఆదాయపు పన్ను శాఖ ట్రాక్ చేస్తుంది. 




 


కొత్త పాన్ కార్డు కోసం ఎలా అప్లై చేసుకోవాలంటే….


 


ఈ లింక్ క్లిక్ చేసి సంబంధిత డాక్యుమెంట్లు అప్లోడ్ చేయడం ద్వారా పాన్ కార్డ్ పొందొచ్చు…


https://www.incometaxindia.gov.in/Pages/tax-services/apply-for-pan.aspx


  ఇంట్లో నుంచే మీ స్మార్ట్‌ఫోన్ ద్వారానే పాన్ కార్డు కోసం అప్లై చేసుకోవచ్చు. దీని కోసం మీ వద్ద ఆధార్ నెంబర్ ఉంటే చాలు. 10 నిమిషాల్లోనే పాన్ కార్డు పొందొచ్చు. ఇది ఇపాన్ కార్డు. దీని కోసం మీరు ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెట్ వెబ్‌సైట్‌కు వెళ్లాలి. అక్కడ ఇన్‌స్టంట్ పాన్ అనే ఆప్షన్ ఉంటుంది.

దీని ద్వారా కొత్త పాన్ కార్డు పొందొచ్చు. ఆధార్ నెంబర్, క్యాప్చా ఎంటర్ చేయాలి. తర్వాత రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. దీన్ని ఎంటర్ చేయాలి. అంతే మీకు ఈపాన్ కా్డు వస్తుంది. ఈమెయిల్, రిజిస్టర్డ్ ఫోన్ నెంబర్‌కు లింక్ వస్తుంది. దీని ద్వారా పాన్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.


ఇప్పటికే పాన్ కార్డు ఉన్నవారు  ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవాలి. లేకపోతే జరిమానా పడుతుంది. పాన్ కార్డు పని చేయదు. ఇంకా ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయలేం. అలాగే అధిక విలువ గల బ్యాంక్ ట్రాన్సాక్షన్లను నిర్వహించలేం.