OU JAC Attack On Allu Arjun House: హైదరాబాద్లోని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిని ఓయూ జేఏసీ నాయకులు ముట్టడించారు. ఇంటి గోడలు ఎక్కి రాళ్లు విసిరారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి కుటుంబాన్ని ఆదుకోవాలని నినాదాలు చేశారు. ఇంటి లోపలికి వెళ్లేందుకు యత్నించగా అక్కడి సిబ్బంది అడ్డుకున్నారు. రేవతి చావుకు అల్లు అర్జునే కారణమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి రూ.కోటి పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. బన్నీ ఇంటి ముందు బైఠాయించి నిరసన తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. కాగా, నిరసన సమయంలో అల్లు అర్జున్ కుటుంబ సభ్యులెవరూ బయట కనిపించలేదు.
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు చేసిన ఓయూ జేఏసీ నేతలు
Ganesh Guptha | 22 Dec 2024 05:13 PM (IST)
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు చేసిన ఓయూ జేఏసీ నేతలు