Ganja At Birthday Party: ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్టణంలో కలకం రేగింది. ఒక ప్రైవేట్ బర్త్ డే పార్టీ జరుగుతుండగా పోలీసులు మెరుపు దాడి చేశారు. ఒక కేజీ గంజాయి సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడని సమాచారం.
బర్త్ డే పార్టీలో గంజాయి కలకలకం..
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం శాంతి నగర్ లో జరిగిన పుట్టినరోజు వేడుకల్లో పోలీసులు కిలో గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి 12 మంది యువకులు, మరో ముగ్గురు యువతులను అదుపులోకి తీసుకున్నట్లు ఏసీపీ హనుమంతరావు తెలిపారు. అయితే యువతులకు,  వేడుకలతో సంబంధం లేదని తమ దర్యాప్తులో తేలిందని, దీంతో వారిని స్టేషన్ నుంచి విడిచిపెట్టామని ఏసీపీ వెల్లడించారు.
పరారీలో అసలు వ్యక్తి కిషోర్....
ఇబ్రహీంపట్నంలోని శాంతినగర్ సందీప్ అనే యువకుడి పుట్టినరోజు వేడుకలపై పోలీసులు దాడులను నిర్వహించారు. ఈ దాడుల్లో కిలో గంజాయిని స్వాధీనం చేసుకుని వేడుకల్లో ఉన్న 12 మంది యువకులు, ముగ్గురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. ఈ పార్టీకి హాజరైన కిషోర్ అనే యువకుడు పోలీసుల కళ్ళు కప్పి పరారు కాగా, మిగిలిన వారిని అరెస్టు చేశామని ఏసీపీ హనుమంతరావు తెలిపారు. ముగ్గురు యువతులు పుట్టినరోజు వేడుకల్లో వంట చేసేందుకు వచ్చినట్లు తమ దర్యాప్తులో తేలడంతో వారిని విడిచిపెట్టినట్లు ఏసీపీ హనుమంతరావు తెలిపారు. పరారైన కిశోర్ దొరికితే గంజాయి ఎక్కడి నుంచి వచ్చిందనే సమాచారం తెలుస్తుందని ఆయన స్పష్టం చేశారు. సాధారణంగా జరిగే వేడుకల్లో సైతం గంజాయి పట్టుబడటం స్థానికంగా కలకలకం రేపుతోంది.
తిరుమలలో సైతం గంజాయి...
గంజాయి సమస్య ఏడు కొండలవాడిని కూడా వదలటం లేదు. ఇటీవల తిరుమలకు వెళుతున్న కూరగాయల వాహనంలో గంజాయిని  తరలిస్తుండగా టిటిడి విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. టిటిడి విజిలెన్స్ అధికారులకు అందిన సమాచారం మేరకు తిరుమలలోని జీఎన్సి టోల్ గేట్ వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా కూరగాయల వాహనంలో దాదాపు అర కేజీ గంజాయిని టిటిడి విజిలెన్స్ అధికారులు గుర్తించారు. దీంతో వాహానంలో ఉన్న రెడ్డి, రెహమాన్ అనే ఇద్దరు యువకులను టిటిడి విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.  
తిరుమలలోని హోటల్స్, దుకాణాలకు ప్రతి నిత్యం కూరగాయలు తరలిస్తున్న క్రమంలో గత కొద్ది కాలంగా కూరగాయల వాహనంలో గంజాయిని తరలిస్తున్నట్లు టిటిడి విజిలెన్స్ అధికారులకు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన టిటిడి విజిలెన్స్ అధికారులు గంజాయిని కొండపై ఎవరి అందిస్తున్నారనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు..
గంజాయికి పై పోలీసులు నిరంతరం నిఘా...
గంజాయి రవాణా, వినియోగం పై ఇప్పటికే పెద్ద ఎత్తున పోలీసులు నిఘాను పెట్టారు.అనుమానం వచ్చిన ప్రాంతాల్లో తనఖీలు చేయటం, చెక్ పోస్ట్ ల ద్వార అంతర్ రాష్ట్ర రవాణాను కట్టడి చేయటం, జిల్లాల సరహద్దుల్లో గస్తిని ముమ్మరం చేయటం ద్వారా గంజాయి వంటి ప్రమాదకరమయినన మత్తు పదార్దాలను వినియోగించటాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పోలీసులు సెబ్ సీంలు, గంజాయి మత్తుపై విద్యార్థులు, యువతకు అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ ప్రైవేట్ పార్టిల్లో, బర్త్ డే వంటి చిన్న చిన్న పార్టీల్లోనూ గంజాయి పట్టుబడుతుండటం సంచలనంగా మారుతోంది. ఈ విషయంలో పోలీసులు కళ్లుకప్పి మరి నిందితులు చాకచక్యంగా గంజాయిని రవాణా చేసుకుపోతున్నారు.