At least 50 people were killed in Nigeria Gunmen Attack: గన్ కల్చర్ అగ్రదేశాల నుంచి సాధారణ దేశాలకు వ్యాప్తి చెందుతోంది. ముఖ్యంగా అమెరికాలో తరచుగా కాల్పులు కలకలం రేపుతుంటాయి. ఇదే తీరుగా నైజీరియాలో విషాదం చోటుచేసుకుంది. ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో 50 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. చర్చిలో ఉన్న వారిని లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపినట్లు సమాచారం. శాంతియుత రాష్ట్రం ఓండోలో ఆదివారం ఈ విషాదం జరిగింది.


అసలేం జరిగిందంటే.. 
ఆఫ్రికా దేశమైన నైజీరియాలో కాల్పులు కలకలం రేపాయి. ఓండో రాష్ట్రంలోని ఓవోలో ఉన్న సెయింట్ ఫ్రాన్సిస్ క్యాథలిక్ చర్చ్‌ (Catholic church in Nigeria)లో ప్రార్థనలు చేసుకుంటున్నారు. ఆ సమయంలో చర్చిలో చొరబడ్డ ఓ దుండగుడు విచక్షణారహితంగా జరిపాడు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా కనిపించిన వాళ్లను కనిపించినట్లుగా తుపాకీతో కాల్పులు జరిపి గన్ మెన్ మారణహోమం చేశాడు. నైరుతి నైజీరియా ప్రాంతంలో జరిగిన ఈ కాల్పుల్లో 50 వరకు ప్రాణాలు కోల్పోయారు.






కాల్పులు జరపడంతో పాటు ఆ గన్‌మెన్ బాంబులతో సైతం చర్చిలోని వారిపై దాడికి పాల్పడ్డాడని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. గన్ మెన్ జరిపిన కాల్పుల్లో కనీసం 50 మంది మరణించారని స్థానిక శాసనసభ్యుడు ఒలువోల్‌ మీడియాకు తెలిపారు. మృతుల్లో చిన్నారులు, మహిళలు అధికంగా ఉన్నట్లు సమాచారం. కాల్పుల జరిగిన అనంతరం పోలీసులు, రెస్క్యూ టీమ్ అక్కడికి చేరుకుని గాయపడిన వారితో పాటు మృతదేహాలను స్థానికంగా ఉన్న సెయింట్ లూయిస్ క్యాథలిక్ హాస్పిటల్‌కు తరలించారు.


అధ్యక్షుడు దిగ్భ్రాంతి..
చర్చిలో దుండగుడు జరిపిన కాల్పులలో భారీగా ప్రాణనష్టం సంభవించిన ఘటనపై నైజీరియా అధ్యక్షుడు ముహమ్మద్ బుహారి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రార్థనలు చేసుకుంటున్న వారిపై కాల్పులు జరపడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇది అత్యంత హేయనీయమైన ఘటన అన్నారు. 


ఓండో రాష్ట్ర పోలీస్ అధికారి ఫన్మిలాయో ఇబుకం ఒడున్‌లమి మీడియాతో మాట్లాడుతూ.. సెయింట్ ఫ్రాన్సిస్ క్యాథలిక్ చర్చిని లక్ష్యంగా చేసుకుని దుండగుడు కాల్పులకు తెగబడ్డాడని తెలిపారు. సాధారణం నార్త్ వెస్ట్ నైజీరియాలో సాయుధ దాడులు, కిడ్నాప్ లాంటివి అధికంగా జరుగుతాయని, అయితే అనూహ్యంగా సౌత్ వెస్ట్ నైజీరియాలో ఈ ఘటన జరగడం స్థానికులను ఆందోళనకు గురిచేసిందన్నారు. కాల్పుల ఘటన, మారణహోమం గురించి తెలుసుకున్న ఓండో స్టేట్ గవర్నర్ అరాకురిన్ ఒలువరోటిమి రాజధాని అబుజా పర్యటను అర్ధాంతరంగా ముగించుకుని ఓండోకు తిరిగివచ్చారు. ఈ దారుణానికి పాల్పడ్డవారిని వదిలిపెట్టేది లేదని, కఠినంగా శిక్షిస్తామని గవర్నర్ స్పష్టం చేశారు.


Also Read: Nizamabad Crime : నిజామాబాద్ జిల్లాలో దారుణం, కేక్ లో మత్తు మందు కలిపి బాలికపై అత్యాచారం!


Also Read: Chittoor News : గంగమ్మ జాతరలో పవన్ కల్యాణ్ వర్సెస్ ఎన్టీఆర్, పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన గ్రామస్తులు