Nellore Knife Attack : నెల్లూరు నగరంలో పట్టపగలు దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తిపై ముగ్గురు వ్యక్తులు కత్తులతో దాడికి పాల్పడ్డారు. నెల్లూరు(Nellore) నగరంలో నిత్యం రద్దీగా ఉండే టౌన్ హాల్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఓ దుకాణంలో పనిచేసే విజయ్ (21) అనే వ్యక్తిపై ఇద్దరు వ్యక్తులు కత్తులతో దాడి(Knife Attack) చేసి అక్కడి నుంచి బైక్ పై పారిపోయారు. దాడికి గురైన విజయ్ రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. బాధితుడు విజయ్ నగరంలోని మనుమసిద్ధి నగర్ కు చెందిన వ్యక్తిగా పోలీసులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న ఒకటో నగర సీఐ వీరేంద్రబాబు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన విజయ్ తన వాహనంలో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పాత కక్షల(Old Factions) నేపథ్యంలో ఈ దాడి జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. పట్టపగలు నడిరోడ్డుపై కత్తులతో దాడి చేయడం నెల్లూరు నగరంలో సంచలనమైంది.
Nellore Knife Attack : నెల్లూరులో దారుణం, పట్టపగలే యువకుడిపై కత్తులతో దాడి
ABP Desam | Edited By: Satyaprasad Bandaru Updated at: 26 May 2022 07:00 PM (IST)
Nellore Knife Attack : నెల్లూరు నగరంలో దారుణ ఘటన జరిగింది. ఓ యువకుడిపై ముగ్గురు కత్తులతో విరుచుకుపడ్డారు. విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.
నెల్లూరులో యువకుడిపై కత్తులతో దాడి
NEXT PREV
చిన్న బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టౌన్ హాల్ దగ్గర ఉన్న ఓ బట్టల షాపులో విజయ్ కుమార్ సెల్స్ బాయ్ పనిచేస్తున్నాడు. ఈరోజు సుమారు 3.30 టైమ్ లో భోజనం చేసి కిందకు వచ్చాడు. ఆ సమయంలో స్కూటీపై వచ్చిన ముగ్గురు వ్యక్తులు విజయ్ పై కత్తులపై దాడి చేశారు. బాధితుడి తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. మాకు తెలిసిన వెంటనే మా వాహనంలో బాధితుడ్ని ఆసుపత్రికి తరలించాం. నిందితులను అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరుస్తాం- సీఐ వీరేంద్రబాబు
Published at: 26 May 2022 07:00 PM (IST)