Nellore Liquor Bottles Destroy :అక్రమ మద్యం రవాణాను అరికట్టడంలో నెల్లూరు జిల్లా పోలీసులు ముందున్నారు. పట్టుకున్న మద్యా్న్ని ధ్వంసం చేయడంలో మాత్రం కాస్త కామెడీ పంచుతున్నారు సెబ్ పోలీసులు. గూడూరు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్ ఆవరణలో మద్యం బాటిళ్లను ధ్వంసం చేశారు. మద్యం బాటిల్స్ ను ధ్వంసం చేయాలంటే మందుతో ఉన్నప్పుడే ఆ బాటిల్ ని పగలగొడితే సరిపోతుంది కదా మరి ముందుగా స్క్రూ డ్రైవర్ తో బాటిల్ మూత తీసి, దాన్ని బకెట్ లో పోసి, ఆ తర్వాత పారబోసి, ఫైనల్ గా ఖాళీ బాటిళ్లు పగలగొట్టడంలో లాజిక్ ఏంటో సెబ్ పోలీసులకే తెలియాలి. గ్లాస్ బాటిళ్లను పగలగొట్టారు, ప్లాస్టిక్ బాటిళ్లను తగలబెట్టారు. మొత్తం 1487 బాటిళ్లను ధ్వంసం చేశామని చెప్పారు పోలీసులు. ఈ వీడియోపై ఇప్పుడు సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి.  


అక్రమ మద్యంపై నిఘా 


ఏపీలో అక్రమ మద్యం రవాణాపై పోలీసులు గట్టి నిఘా పెట్టారు. తనిఖీల్లో పట్టుబడిన కోట్ల రూపాయల విలువైన అక్రమ మద్యాన్ని రోడ్డు రోలర్లతో తొక్కించేశారు. ఏపీలోని పలు జిల్లాల్లో ఎక్సైజ్‌ పోలీసులు అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకుంటున్నారు. ఇలా స్వాధీనం చేసుకున్న మద్యాన్ని పోలీసులు ధ్వంసం చేస్తున్నారు. అక్రమ మద్యం ధ్వంసం చేసేటప్పుడు సెజ్ పోలీసులు డిఫరెంట్ స్టైల్స్ ఫాలో అవుతున్నారు. సీసాలను క్రమపద్దతిలో పేర్చి ధ్వంసం చేస్తు్న్నారు. రోడ్డు రోలర్ సహాయంతో అక్రమ మద్యాన్ని ధ్వసం చేస్తున్నారు. 


రూ.2 కోట్ల విలువైన మద్యం ధ్వంసం 


కర్నూలు సెబ్ పోలీసులు గత ఏడాది పట్టుబడిన సుమారు రెండు కోట్ల రూపాయలకు పైగా విలువైన మద్యం బాటిళ్లను ధ్వంసం చేశారు. 593 కేసులలో రెండు కోట్ల రూపాయలకు పైగా విలువైన 66 వేల మద్యం బాటిల్ లను పోలీసులు రోడ్డు రోలర్ తో తొక్కించేశారు. నగర శివారులోని పంచలింగాల తాండ్రపాడు మధ్యలో రోడ్డుపై మద్యం బాటిళ్లు పేర్చి రోడ్డు రోలర్ తో తొక్కించారు.