Three Kids Drowned In Kandaleru Reservoir: నెల్లూరు జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. వేసవి కావడంతో సరదాగా సమయాన్ని గడిపేందుకు కండలేరు జలాశయం వద్దకు వచ్చిన రెండు కుటుంబాల్లో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలు సహా మరో వ్యక్తి కండలేరులో గల్లంతయ్యారు. అర్థరాత్రి వరకు సహాయక చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది. మరో ఇద్దరు మాత్రం సురక్షితంగా బయటపడ్డారు. గల్లంతైన ముగ్గురికోసం మళ్లీ సహాయక చర్యలు మొదలయ్యాయి. 




తమిళనాడు నుంచి వచ్చి స్థిరనివాసం.. 
తమిళనాడుకి చెందిన బోసు, పొన్ను కుమార్ కుటుంబాలు గత ఐదు సంవత్సరాల క్రితం నెల్లూరు జిల్లాకు వచ్చి స్థిరపడ్డాయి. నెల్లూరు జిల్లాలో వడియాలు, బొరుగులు అమ్ముకుంటూ వీరు జీవనం సాగించేవారు. చేజర్ల మండలం కొల్లపనాయుడుపల్లికి వలస వచ్చి చిన్న చిన్న వ్యాపారులు చేసుకునేవారు. గ్రామానికి కొంత దూరంలో ఉన్న కండలేరు జలాశయాన్నీ చూసేందుకు బోసు, పొన్ను కుమార్ కుటుంబ సభ్యులు మంగళవారం సాయంత్రం కండలేరు జలాశయం 8వ కిలో మీటర్ ర్యాంపు వద్దకు చేరుకొన్నారు. జలాశయం చూస్తూనే నీటిలో దిగారు. ఈ క్రమంలో పొన్ను కుమార్ (37),అతని కుమార్తె పవిత్ర (6), పోన్ను కుమార్ సోదరుడు బోసు కుమార్తె లక్ష్మి (11) ముగ్గురు నీటిలో గల్లంతయ్యారు. దీన్ని గమనించిన బోసు కుటుంబ సభ్యులు గట్టిగా కేకలు వేయడంతో అక్కడ ఉన్న జాలర్లు వచ్చి వెదికారు. ఆచూకీ దొరకలేదు. దీంతో పోలీసులకు సమాచారమిచ్చారు. 




కండలేరులో ప్రమాదం జరిగిందన్న విషయం తెలుసుకుని పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. పొదలకూరు సిఐ సంగమేశ్వర రావు, కండలేరు ఎస్సై అనూష, వీఆర్వో రాజగోపాల్ నాయుడు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గజ ఈత గాళ్లను రప్పించి వెదికించారు. కానీ వారి ఆచూకీ దొరకలేదు. చీకటిపడి పోవడంతో  సహాయక చర్యలు బుధవారం ఉదయం నుంచి తిరిగి ప్రారంభించారు. కళ్ల ముందే పొన్ను కుమార్, కుమార్తె నీటిలో మునిగి పోవడంతో కుమార్ తల్లి, భార్య, అన్న కుటుంబ సభ్యులు రోదనలతో ఆ ప్రాంతమంతా విషాదఛాయలు అలుముకున్నాయి.


చీరతో కాపాడి.. 
బోసు భార్య పుష్పవల్లి సమయస్ఫూర్తితో తన భర్త, బిడ్డను కాపాడగలిగారు. నీళ్లలో మునిగిపోయినవారిని కాపాడేందుకు బోసు, బోసు కుమార్తె లక్ష్మి కూడా వెళ్లారు. అయితే వారు కూడా నీటిలో కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో పుష్పవల్లి సమయస్ఫూర్తిని ప్రదర్శించారు. తన చీర విప్పి వారికి సాయంగా నీటిలో పడవేశారు. ఆ చీర కొంగు పట్టుకుని బోసు, కుమార్తె లక్ష్మి క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు. వారి కుటుంబానికి చెందిన మరో ముగ్గురు నీటిలో గల్లంతవడంతో విషాదం నెలకొంది. 


Also Read: Brooklyn Subway Shooting: న్యూయార్క్‌ కాల్పుల ఘటనలో 10 మంది మృతి, నిందితుడి ఫొటోలు విడుదల చేసిన పోలీసులు


Also Read: Visakha News : విశాఖ కోర్టు సంచలన తీర్పు, పోక్సో కేసులో 10 ఏళ్ల జైలు శిక్ష