Nellore News : తమ్ముడి వివాహేతర సంబంధాన్ని కళ్లారా చూడటంతో సొంత తమ్ముడ్ని హత్య చేశాడు అన్న. ఈ ఘటన ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సంచలనంగా మారింది. తమ్ముడు అక్రమ సంబంధం పెట్టుకుంది సొంత అన్న భార్యతోనే కావడం ఇక్కడ విశేషం. తాను ఇంటికి వచ్చే సరికి తన భార్య తమ్ముడితో కలసి ఉండటం చూసిన భర్త కోపోద్రిక్తుడై వెంటనే తమ్ముడిపై దాడి చేశాడు. కర్రతో తలపై కొట్టాడు. ఆ దెబ్బలకి తమ్ముడు అక్కడే రక్తపు మడుగులో పడిపోయి చనిపోయాడు. చిల్లకూరు మండలం కాకువారిపాలెంలో ఈ ఘటన జరిగింది. 


అసలేం జరిగింది?


కాకువారి పాలెం గ్రామంలోని గిరిజన కాలనీకి చెందిన అద్దెపల్లి బాలాజీ, ప్రతాప్‌ అన్నదమ్ములు. ఇద్దరికీ వివాహాలయ్యాయి. వేరు కాపురాలు పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో తమ్ముడు ప్రతాప్ భార్య కాన్పు సమయంలో చనిపోయింది. అప్పటినుంచి ప్రతాప్ కూడా తన అన్న కుటుంబంతోనే కలసి నివశిస్తున్నాడు. బాలాజీ, తన భార్య కలసి ఉంటుండగా ఆ కుటుంబంలోకి ప్రతాప్ వచ్చి చేరాడు. కానీ ప్రతాప్ తన బుద్ధి చూపించాడు. అన్న బాలాజీ పనికి వెళ్లిన సమయంలో తమ్ముడు బాలాజీ వదినతో చనువు పెంచుకున్నాడు. ఈ చనువు పెరిగి పెద్దదై అక్రమ సంబంధానికి దారి తీసింది. దీంతో బాలాజీ బయటకు వెళ్లిన తర్వాత వదిన మరిది చనువుగా ఉండేవారు. ఈ విషయం బాలాజీకి తెలియకుండా మేనేజ్ చేస్తూ వచ్చారు. 


పరారీలో అన్న


చివరకు పాపం బయటపడింది. రాత్రి ప్రతాప్, అతని వదిన సన్నిహితంగా ఉండగా సడన్ గా ఇంచికొచ్చిన బాలాజీ షాకయ్యాడు. కోపంతో తమ్ముడిపై దాడి చేశాడు. ప్రతాప్ అక్కడికక్కడే చనిపోయాడు. ఆ తర్వాత బాలాజీ అక్కడినుంచి పరారయ్యాడు. స్థానికుల సమాచారం మేరకు గూడూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గూడూరు రూరల్‌ సీఐ శ్రీనివాసులరెడ్డి, ఎస్‌ఐ గోపాల్‌రావు సంఘటనా స్థలానికి చేరుకుని అక్కడ వివరాలను సేకరించారు. ప్రతాప్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాలాజీ పరారీలో ఉన్నాడని, అతడిని వీలైనంత త్వరగా పట్టుకుంటామని చెప్పారు సీఐ శ్రీనివాసులరెడ్డి. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 


నెల్లూరులో వరుస హత్యలు 


ఇటీవల నెల్లూరు జిల్లాలో వరుస హత్యలు సంచలనంగా మారాయి. ఇటీవల నెల్లూరులోని ఓ దంపతులను వారి హోటల్ లో పనిచేసే సిబ్బంది దారుణంగా హత్య చేశారు. ఆ ఘటనలో నిందితులను పట్టుకున్నారు పోలీసులు. ఆ తర్వాత మద్యం మత్తులో తన స్నేహితులిద్దర్ని ఓ వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. ఇప్పుడు ఓ అన్న తన తమ్ముడిని కిరాతకంగా హత్య చేశాడు. ఇక్కడ వివాహేతర సంబంధం ప్రధాన కారణంగా మారింది. వివాహేతర సంబంధాలు కుటుంబాల్లో చిచ్చు పెడతాయనడానికి ఇది మరో ఉదాహరణ. ఇక్కడ తమ్ముడు హత్యకాగా, అన్న జైలుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. 


 Also Read : Rangareddy News : అనారోగ్యంతో భార్య మృతి, తట్టుకోలేక రైలుకు ఎదురెళ్లిన భర్త!


Also Read : Tirupati News : పట్టాదారు పాసుపుస్తకం ఇవ్వకుండా వేధింపులు, కలెక్టరేట్ లో దంపతుల ఆత్మహత్యాయత్నం!