Fire Accident: పల్నాడు జిల్లా నరసారావుపేట మార్కెట్ సెంటర్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. అర్ధరాత్రి సమయంలో ఫ్లైఓవర్ గకింద ఉన్న ఓ దుకాణంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పక్క దుకాణాలకు కూడా మంటలు వ్యాపించాయి. చూస్తుండగానే మంటలు ఉవ్వెత్తున లేచాయి. ఎక్కువగా మంటలు రావడంతో అక్కడకు చేరుకున్న స్థానికులు పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. కానీ వాళ్లంతా వచ్చేసరికే దుకాణాలన్నీ పూర్తిగా కాలిపోయాయి. అందులో ఉన్న సామగ్రి, వస్తువులు మొత్తం బాడిదయ్యాయి. 


అయితే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అదే సమయంలో అక్కడకు చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న దుకాణ యజమానులు రాత్రికి రాత్రే పరుగు పరుగున అక్కడకు చేరుకున్నారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తూ.. తమ జీవనానికి ఆధారమైన దుకాణాలను కోల్పోయామంటూ బావురుమన్నారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న నరసారావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అక్కడకు చేరుకొని దగ్ధమైన దుకాణాలను పరిశీలించారు. అధికారులతో సమైవేశమైన నష్టాన్ని అంచనా వేసి బాధితులకు పరిహారం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. 


నిన్నటికి నిన్న బైక్ షోరూంలో..


ఎలక్ట్రిక్ వెహికల్ షోరూములో అగ్ని ప్రమాదాలు నిత్య కృత్యం అవుతున్నాయి. ఏదో ఒక చోట ఈవీ షోరూముల్లో అగ్ని ప్రమాదం సంభవిస్తున్నాయి. ఈ ప్రమాదాల్లో లక్షల కొద్దీ రూపాయల ఆస్తి నష్టం సంభవిస్తోంది. వివిధ కారణా వల్ల అగ్ని ప్రమాదాలు జరుగుతున్నా.. ఎలక్ట్రిక్ వెహికల్ షోరూముల్లో అగ్ని ప్రమాద ఘటనలు ఈ మధ్య కాలంలో చాలా పెరిగిపోయాయి. తాజాగా పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ పట్టణంలోని ఓ బైక్ షోరూములో మంటలు చెలరేగి ప్రమాదం సంభవించింది. విద్యుత్ వాహనాలు(ఎలక్ట్రిక్ వెహికల్స్) విక్రయించే షోరూములో ఈ ప్రమాదం జరిగింది. 


ఈ ప్రమాదంలో దాదాపు 36 వాహనాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. పూర్తిగా కాలి పోయి బూడిద అయ్యాయి. టైర్లు, సీట్లు, ఫైబర్, ఇతర ప్లాస్టిక్ తో తయారు చేసినవి మొత్తం కాలిపోయాయి. కేవలం ఐరన్ తో చేసిన ఫ్రేములు మాత్రమే మిగిలాయి. మంటలతో వచ్చిన పొగలు చూసిన స్థానికులు, వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. చుట్టు పక్కల వారు ఇచ్చిన సమాచారంతో అగ్ని ప్రమాదం జరిగిన షోరూముకు చేరుకును అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపులోకి తీసుకువచ్చారు ఈ ప్రమాదంలో షోరూములో ఉన్న మొత్తం 25 వాహనాలు కాలి బూడిద అయినట్లు అధికారులు తెలిపారు. బ్యాటరీలు కూడా మంటలకు కాలిపోయాయని తెలిపారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు ఎగిసి పడి ఉండొచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అగ్ని ప్రమాదానికి కారణం పూర్తి స్థాయి విచారణలో తెలుస్తుందని వెల్లడించారు. సుమారు రూ. 50 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు షోరూము యజమానులు తెలిపారు. 


షార్ట్ సర్క్యూట్ తో చెలరేగిన మంటలు!


దీపావళి దమాకా స్ఫెషల్ ఆఫర్ నిర్వహించినట్లు షోరూమ్ యజమాని రమేష్ బాబు తెలిపారు. ఈ దీపావళికి ద్విచక్ర వాహనాలు ఎక్కువగా అమ్మకాలు జరుగతాయని భావించి వాహనాలను ఎక్కువగా షోరూమ్ కు తెప్పించామని యజమాని చెబుతున్నారు. అయితే అర్దరాత్రి ఒంటి గంట సమయంలో షార్ట్ షర్క్యూట్ తో మంటలు చెలరేగినట్లు యజమాని చెబుతున్నారు. అగ్నిమాపక సిబ్బంది చేరుకునే లోపే వాహనాలు పూర్తిగా మంటలలో దగ్దం అయ్యాయి. 25 కొత్త ఎలక్ట్రికల్ వాహనాలతో పాటు సర్వీసింగ్ కు వచ్చిన వాహనాలతో కలసి 36 వాహనాలు పూర్తిగా మంటలలో కాలిపోయాయి. షోరూమ్ లో ఉన్న వాహనాలతో పాటు షోరూమ్ లో ఉన్న ఇంటీరియల్ మొత్తం కాలి బూడిద అయింది. సుమారు 50 లక్షల రూపాయిలు వరకూ ఆస్థి నష్టం వాటిల్లిందని షోరూమ్ యజమాని రమేష్ తెలిపారు.