Nandyal Crime : నంద్యాల జిల్లాలోని పాండురంగాపురం గ్రామంలో బాలుడి హత్య కలకలం రేపుతోంది. ఐదు సంవత్సరాల లోపు బాలుడిని గుర్తుతెలియన దుండగులు కాల్చి చంపారు. గ్రామానికి చెందిన సూర్య అనే బాలుడు గత నెల 30వ తేదీన అంగన్వాడి స్కూల్ కు వెళ్లి తిరిగి రాలేదని బాలుడి తల్లి మాధవి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మృతి చెందిన బాలుడు, తప్పిపోయిన బాలుడు ఒక్కరే అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డాగ్ స్క్వాడ్ ద్వారా పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. ఐదేళ్ల లోపు బాలున్ని మినుము పొట్టులో వేసి పెట్రోల్ వేసి నిప్పు పెట్టి దుండగులు హత్య చేసిన ఘటనతో గ్రామస్థులు ఉలిక్కి పడ్డారు.
పల్లీ యంత్రంలో చిక్కుకుని బాలుడు మృతి
సరదాగా పొలానికి తీసుకెళ్లిన కుమారుడు తల్లిదండ్రుల కళ్లముందే విగతజీవిగా మారాడు. అప్పటి వరకూ ఎంతో సరదాగా ఆడుకున్న చిన్నారిని మాయదారి యంత్రం మింగేసింది. కోత కోసే యంత్రం క్షణాల్లో బాలుడి తలను, మొండేన్ని వేరుచేసిన దృశ్యాన్ని చూసి తల్లిదండ్రులు గుండెల పగిలేలా రోధించారు. ఉగాది పండగ రోజునే ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. కన్నకొడుకు కళ్ల ముందే విగత జీవుడిగా పడిఉండడానికి చూసి తల్లిదండ్రుల గుండెలవిసేలా రోదించడం స్థానికులను కంటతడి పెట్టించింది. ఈ ఘటన నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండల పరిధిలో శనివారం జరిగింది.
అసలేం జరిగిందంటే?
నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం గాజీనగర్ గ్రామానికి చెందిన పేట జానీ, రాణి దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. శనివారం ఉదయం ఎంతో ఆనందంగా ఉగాది పండుగ చేసుకుంది ఆ కుంటుంబం. పాఠశాలకు సెలవు కావడంతో కుమారులు ఇద్దరినీ తల్లిదండ్రులు పొలానికి తీసుకెళ్లారు. తల్లిదండ్రులు వేరుశెనగ చేనులో యంత్రం ద్వారా పల్లీలను వేరు చేయించే పనిలో ఉన్నారు. ఇద్దరు పిల్లలు అక్కడ ఆడుకుంటున్నారు. చిన్న కుమారుడు మధు(9) మెడలో చున్నీ చుట్టుకుని సరదాగా గంతులేస్తూ పల్లి యంత్రం వైపు వెళ్లాడు. ఈ క్రమంలో మధు మెడలోని చున్నీ యంత్రంలో చుట్టుకుని క్షణకాలంలో తల తెగిపడింది. అంతే తల్లిదండ్రులు ఆ దృశ్యాన్ని చూసి కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యుల అశ్రునయనాల మధ్య బాలుడి అంత్యక్రియలు పూర్తిచేశారు. తండ్రి జానీ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read : Viral News: కుమారుడి సెల్‌ఫోన్ కోసం రెండు మేకలు అమ్మింది- అదే ఆ విద్యార్థిని కటకటాల పాల్జేసింది