Nandu's World Reaction About UK Visas Scam Allegations : నందు వరల్డ్... సోషల్ మీడియాను రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వారికి పరిచయం అక్కర్లేని పేరు. నంద కిశోర్, మధుమిత అనే జంట చేసే వీడియోలు నెట్టింట చాలా ఫేమస్. రీసెంట్‌గా వీరిపై వీసా స్కామ్ ఆరోపణలు వచ్చాయి. నిరుద్యోగుల ఆశలను ఆసరా చేసుకుని కోట్ల రూపాయల వసూళ్లకు పాల్పడ్డారనే తీవ్ర ఆరోపణలు రావడం హాట్ టాపిక్‌గా మారింది. ఇంత జరిగినా వారు రియాక్ట్ కావడం లేదనే విమర్శలు వచ్చాయి. ఈ స్కామ్ ఆరోపణలపై నందు వరల్డ్ మధుమిత రియాక్ట్ అయ్యారు.
'కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు'
సోషల్ మీడియాలో కొందరు కావాలనే కుట్రతో తమపై దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు నంద కిశోర్ భార్య మధుమిత. 'మాపై కొందరు కుట్రతో డబ్బులిచ్చి మరీ ఫేక్ ప్రచారం చేస్తున్నారు. అవన్నీ నమ్మొద్దు. ఈ విషయంపై యూకేలో ఆల్రెడీ యాక్షన్ తీసుకున్నారు. ఇక్కడి నుంచి పారిపోయిన ముగ్గురు తెలుగు వాళ్లు ఇండియా వెళ్లి పనిగట్టుకుని డబ్బులు పెట్టి మరీ మాపై నెగిటివ్ క్యాంపెయిన్ చేస్తున్నారు.
నాకు, నా భర్తకు కానీ 21 ఏళ్లుగా ఇండియాలో ఎలాంటి కంపెనీలు మా పేర్లు మీద లేవు. మా పేర్లు చెప్పి కొందరు వ్యక్తులు డబ్బులు తీసుకుంటున్నారు. ఇలాంటి వాటిని నమ్మకండి. మాకు ఏదున్నా యూకేలో మాత్రమే ఉంది. మా కంపెనీ పేర్లు గానీ, మా వర్క్ ప్లేసులు గానీ మిస్ యూజ్ చేసుకుని ఫేక్ ప్రచారం చేస్తున్నారు. వీటిని నమ్మకుండా ఇన్ఫార్మ్ చేయండి. మా గురించి ఏ విషయమైనా మేమే చెబుతాం.' అని చెప్పారు.
Also Read : Ram Charan : ఫ్యాన్స్ కోసం రక్తం చిందిస్తా... పెద్ది ఆడలేదు పోరాడాడు - రామ్ చరణ్ స్పీచ్ హైలెట్స్
అసలేం జరిగిందంటే?
సోషల్ మీడియా సెలబ్రిటీలుగా ఫుల్ ఫేమస్ అయిన నందూస్ వరల్డ్ కపుల్... యూకే వెళ్లాలనే నిరుద్యోగుల ఆశలను ఆసరాగా చేసుకుని భారీ మోసానికి తెర లేపినట్లు వీరిపై ఆరోపణలు వచ్చాయి. ఇన్ స్టా గ్రామ్‌లో ఈ జంటకు లక్షలాది మంది ఫాలోవర్స్ ఉన్నారు. యూకేలో స్థిరపడాలనుకునే నిరుద్యోగులు వీసా పొందేందుకు అవసరమైన సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్ షిప్ (COS) ఇప్పిస్తామంటూ నందూస్ వరల్డ్ జంట నమ్మించినట్లు తెలుస్తోంది.
యూకేలో తమకు 4 నుంచి 6 కంపెనీలతో ప్రత్యక్ష సంబంధాలున్నాయని... ఎవరికైనా వీసాలు ఇప్పించగలమని నమ్మబలికి ఒక్కొక్కరి నుంచి రూ.20 లక్షల వరకూ వసూలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. బాధితులు చేస్తున్న కాల్స్‌కు కూడా ఎలాంటి స్పందన లేదని సోషల్ మీడియాలో తమ వాదన వినిపిస్తున్నారు. కొన్ని నెలల క్రితం కూడా ఈ జంటపై ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. అప్పుడు కూడా ఈ జంట ఇలాగే అదంతా ఫేక్ అని కొట్టి పారేశారు. గత వారం రోజులుగా బాధితులంతా నెట్టింట వరుస పోస్టులు పెడుతుండడంతో ఇది హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో నందూస్ వరల్డ్ మధుమిత అదంతా ఫేక్ అని చెప్పారు.
Also Read : Ram Charan : ఫ్యాన్స్ కోసం రక్తం చిందిస్తా... పెద్ది ఆడలేదు పోరాడాడు - రామ్ చరణ్ స్పీచ్ హైలెట్స్
