Mumbai CEO Kidnapped: 



ముంబయిలో ఘటన..


ముంబయిలో ఓ మ్యూజిక్ కంపెనీ సీఈవోని కిడ్నాప్ చేశారు. శిందే క్యాంప్‌లోని శివసేన ఎమ్మెల్యే ప్రకాశ్ సుర్వే కొడుకు రాజ్ సుర్వే ఈ కిడ్నాప్ చేశాడు. సీఈవోని కిడ్నాప్ చేయడంతో పాటు చంపేస్తానంటూ బెదిరించాడు. నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితుడు ఆఫీస్‌లో ఉండగా ఉన్నట్టుండి నిందితుడు లోపలకు వచ్చాడు. ఆఫీస్‌ నుంచి కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే నిందితులను చేజ్ చేసి పట్టుకున్నారు. FIR ప్రకారం...బాధితుడుని కిడ్నాప్ చేసి ఎమ్మెల్యే ప్రకాశ్ సుర్వే ఆఫీస్‌కి తీసుకెళ్లారు. కొన్ని డాక్యుమెంట్స్‌పై సంతకం చేయాలంటూ బలవంతం చేశారు. గన్‌తో బెదిరించారు. అదే సమయంలో లోకల్ పోలీసులు ఎంటర్ అయ్యి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. Kidnapping and Arms Act కింద కేసు నమోదు చేశారు. ముంబయిలోని చింతామణి క్లాసిక్ కాంప్లెక్స్‌లో ఉన్న కంపెనీలోకి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు చొచ్చుకుని వచ్చారు. ఏ పొలిటికల్ లీడర్ పేరు చెప్పి బెదిరించారు. తమతో రాకపోతే చంపేస్తామని చెప్పారు. ఓ రాజకీయ నేతతో ఆ కంపెనీ సీఈవోకి ఆర్థిక లావాదేవీల విషయంలో వివాదం నడుస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. 


సీసీ కెమెరాలో రికార్డ్ 


ఈ కిడ్నాప్‌కి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. దాదాపు 10-15 మంది ఆఫీస్‌లోకి అక్రమంగా రావడం అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. స్టాఫ్‌ని బెదిరించి, సీఈవోని తీసుకెళ్లిపోయారు. రెండు కార్లలో అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆఫీస్ స్టాఫ్‌ లోకల్ పోలీసులకు కాల్ చేశారు. వెంటనే అలెర్ట్ అయిన పోలీసులు ఛేజ్ చేసి పట్టుకున్నారు. కంటెంట్ క్రియేట్ చేస్తానని చెప్పి రూ.8 కోట్లు తీసుకున్నాడని, అప్పటి నుంచి ఉలుకు పలుకు లేదని నిందితులు ఆరోపిస్తున్నారు. డబ్బులు వెనక్కి ఇవ్వమని చెప్పినా పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. అయితే ఈ కంపెనీ సీఈవో మాత్రం డబ్బులు వెనక్కి ఇచ్చేందుకు ఒప్పుకోవడం లేదు. తనను చంపాలని చూస్తున్నారని ఆరోపించాడు.   


Also Read: వార్‌ డిక్లేర్ చేసిన నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్‌ ! కొత్త ఆయుధాలతో మిలిటరీ డ్రిల్స్