మధ్యప్రదేశ్‌ గునా జిల్లాలో ఎన్నడూ కనీవినీ ఎరగని రీతిలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. 14 ఏళ్ల వయసు ఉన్న కన్న కుమార్తెను ఓ తండ్రి హత్య చేశాడు. అంతటితో ఆగకుండా ఆ శవంతోనే లైంగిక చర్యకు తెగబడ్డాడు. బాలిక చనిపోయిన అనంతరం ఆమెపై అత్యాచారం జరిగిందని తెలుసుకొని, అదీ తండ్రే ఆ పాడు పని చేశాడని పోలీసులు తెలుసుకొని విస్తుపోయారు. బాలికను అడవిలోకి తీసుకెళ్లి ఈ దురాగతానికి ఒడిగట్టినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలికపై అత్యాచారం చేసిన కన్న తండ్రే ఏమీ ఎరగనట్లుగా.. తన కూతురు కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు కళ్లు బయర్లు కమ్మే విషయాలు గుర్తించారు.


పీటీఐ వార్తా సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. దివ్యాంగుడైన ఓ వ్యక్తి తన 14 ఏళ్ల కూతురిని దారుణంగా చంపి, శవంపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు. మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలోని ఓ గ్రామంలో ఈ ఘటన బుధవారం చోటు చేసుకుంది. తన కూతురు కనిపించడం లేదని, ఇంటి నుంచి ఎక్కడికకో వెళ్లిపోయి ఉంటుందని నిందితుడే పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. 


పోలీసులు స్థానికులు, చుట్టుపక్కల వారిని పిలిచి విచారణ జరిపారు. చనిపోయిన బాలిక ఆఖరు సారి తన తండ్రితోనే ఎక్కడికో వెళ్లడం చూశామని వారు చెప్పారు. దీంతో పోలీసులకు కన్న తండ్రి పైన అనుమానం కలిగింది. తండ్రిని పిలిచి పోలీసులు తమదైన శైలిలో విచారణ జరపగా.. అప్పుడు తండ్రి నిజం ఒప్పుకున్నాడు. కూతుర్ని దామోలీ అటవీ ప్రాంతంలోకి మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో తీసుకెళ్లి అత్యాచారం చేశానని చెప్పాడు. 


అంతకుముందు బాలిక ఈ విషయం గురించి కుటుంబ సభ్యులకు చెప్తానని బెదిరించడంతో.. భయపడిపోయిన తండ్రి కూతుర్ని చంపేసి ఆమె శవంపై అఘాయిత్యానికి పాల్పడినట్లుగా పోలీసులు వెల్లడించారు. నిందితుడు ఇచ్చిన వివరాలను ఆధారంగా చేసుకొని పోలీసులు దామోలీ అటవీ ప్రాంతంలో వెతగ్గా అక్కడ బాలిక శవాన్ని గుర్తించారు. దాన్ని స్వాధీనం చేసుకొని పోస్టు మార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నిందితుడిపై ఐపీసీ‌లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని గుణ జిల్లా పోలీసులు వెల్లడించారు.


Also Read: Guntur Crime: కీచక ఆటో డ్రైవర్, ఆటో ఎక్కిన మహిళపై అత్యాచారయత్నం!


Also Read: Naresh Wife Cheating : నరేష్ ఆస్తులు చూపించి అప్పులు - మాజీ భార్య నిర్వాకంతో నటుడికి చిక్కులు !