Mother in UP killed children: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ముస్కాన్ అనే మహిళ తన భర్తను చంపేసి ముక్కలు చేసి డ్రమ్ములో వేసిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఇప్పుడు మరో ముస్కాన్ అంత కంటే ఘోరం చేసింది. అయితే భర్తను కాకుండా కడుపున పుట్టిన పిల్లల్నిచంపేసింది.
ముజఫర్ నగర్ కు చెందిన ముస్కాన్ తన ప్రేమికుడితో జల్సాలు చేసేందుకు అడ్డుగా ఉన్నారని ప్రియుడు జునైద్ తో కలిసి పిల్లల్ని చంపేసింది. ముస్కాన్ , వసీమ్ భార్యభర్తలు. అయితే వసీమ్ పెళ్లికి ముందే జునైద్ అనే వ్యక్తిని ప్రేమించింది. ఇద్దరూ కుదరలేదు. దాంతో వసీమ్ ను పెళ్లి చేసుకుంది ముస్కాన్. వారికి ఇద్దరు పిల్లలు పుట్టారు.
కుమారుడు అర్హాన్ (04), కుమార్తె అనయ (01) జన్మించారు. గత గురువారం, భోపాలోని రూర్కలి తలాబ్ అలీ గ్రామంలో ఇద్దరూ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. వారిద్దరూ తల్లి ముస్కాన్ తో కలిసి ఇంట్లో పడుకున్నారు. మొదట కుటుంబ సభ్యులు పోస్ట్‌మార్టం చేయడానికి నిరాకరించారు. కానీ పోలీసుల ఒప్పించారు. పిల్లల మృతదేహాలపై ఎటువంటి గాయం గుర్తులు లేవు. ప్రాథమికంగా హత్యకు కారణం తెలియదు. పోలీసులు వసీం భార్య ముస్కాన్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో అసలు నిజం బయటపడింది.
పిల్లలను వదిలించుకుని జునైద్ తో జల్సా చేయాలని ముస్కాన్ అనుకుంది. ఇద్దరూ కలిసి పిల్లల్ని చంపాలని నిర్ణయాలు తీసుకున్నారు. జునైద్ రసగుల్లాల్లో విషం కలిపి తీసుకు వచ్చాడు. తల్లి ముస్కాన్ వాటిని పిల్లలకుఇచ్చారు. వారు తిని చనిపోయారు. నిందితుడు ఒక గంట పాటు ఇంట్లోనే ఉన్నాడు. పిల్లలు చనిపోయారని నిర్దారించుకున్న తర్వాత వెళ్లిపోయాడు. ఈ తల్లి గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ముస్కాన్ భర్త ఉపాధి కోసం వేరే ప్రాంతంలో ఉండటంతో ఈ దారుణం జరిగిపోయింది.