Siddipet Crime News | సిద్దిపేట జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గ్రామీణ ఉపాధి హామీ పనుల్లో బండరాళ్లు మీద పడి తల్లీ కూతురు మృతిచెందగా, మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. అక్కన్నపేట మండలం గోవర్ధనగిరిలో ఈ విషాదం జరిగింది. మృతులను తల్లి సరోజ, కూతురు మమతగా గుర్తించారు. గాయపడిన వారిని చికిత్స అందించేందుకు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.