Faridabad woman : ఇంట్లో వ్యక్తిని పెళ్లి చేసుకుని తమ ఇంటికి వచ్చిన మహిళలను ఆ ఇంట్లో వాళ్లందరూ కలిసి చంపేశారు. ఇంటి ముందుపది అడుగుల గొయ్యి తీసి పాతిపెట్టారు. ఏమీ తెలియనట్లుగా సైలెంట్ గా ఉన్నారు. పైగా తమ ఇంటికి వచ్చిన కోడలు లేచిపోయిందని ప్రచారం చేశారు.
ఇంటికి కోడలిగా వస్తే కాటికి పంపారు ! ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ జిల్లాలోని ఖేరా గ్రామానికి చెందిన రాజ్‌పుత్ ఏప్రిల్ 25న కనిపించకుండా పోయినట్లు ఆమె భర్త పల్లా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఆమె మేధో వికలాంగురాలు. ముందు రోజు అదృశ్యమైందని చెప్పాడు. ఆమె మిస్సింగ్ కేసులో ఆధారాల కోసం దర్యాప్తు అధికారులు సంప్రదించినప్పుడు ఆమె భర్త వేరే వారితో లేచిపోయి ఉండవచ్చని చెప్పుకొచ్చాుడు. భర్త అలా చెప్పడం రాజ్‌పుత్ కుటుంబానికి సందేహం కలిగించింది. ఆమె ఆచూకీ కనిపెట్టడానికి అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ, పోలీసులకు వారాల తరబడి ఆధారాలు దొరకలేదు.
ఇంటి ముందే పది అడుగుల గొయ్యి తీసి పాతి పెట్టారు !
చివరికి చిన్ న క్లూ ద్వారా భర్త అరుణ్ సింగ్ తండ్రి భూప్ సింగ్ (50) ను విచారణ కోసం తీసుకెళ్లారు. తమదైన స్టైల్లో విచారించడంతో భూప్ రాజ్‌పుత్‌ను హత్య చేసి, ఆమె మృతదేహాన్ని రాత్రి పూడ్చిపెట్టినట్లు అంగీకరించాడు. పోలీసులు జెసిబి యంత్రాన్ని రప్పించి ఎక్కడ పూడ్చి పెట్టారని చెప్పారో అక్కడ తవ్వితీశారు. దాదాపు 8 నుండి 10 అడుగుల లోతున తవ్విన తర్వాత రాజ్‌పుత్ కుళ్ళిపోయిన మృతదేహం బయటపడింది.
చివరికి పోలీసులు కోటింగ్ ఇవ్వడంతో అసలు నిజం వెలుగులోకి !
ఆ ప్రాంతంలో అధికారిక నీరు లేదా డ్రైనేజీ మౌలిక సదుపాయాలు లేకపోవడంతో మురుగునీటి కనెక్షన్ కోసం ఏప్రిల్‌లో మొదట ఈ గొయ్యిని తవ్వారు. కుటుంబం దానిని ఇసుకతో నింపి, హత్య చేసిన తర్వాత, ఆమె మృతదేహాన్ని చీకటి ముసుగులో అక్కడే పాతిపెట్టింది. ఏమి జరిగిందో పొరుగువారిలో ఎవరికీ తెలియకుండా మేనేజ్చేశారు. రాజ్‌పుత్ పారిపోయి ఉండవచ్చని చెప్పి కుటుంబం పొరుగువారిని తప్పుదారి పట్టించిందని గుర్తించారు.
కట్నంకోసమే చంపినట్లుగా భావిస్తున్నపోలీసులు ఆమెను కట్నం కారణంగా చంపారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజ్‌పుత్ భర్త, సింగ్ కుటుంబంలోని ఇతర సభ్యులపై భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు 103(1) (హత్య), 3(5) (సాధారణ ఉద్దేశ్యం) , 61 (నేరపూరిత కుట్ర)ను ప్రయోగించడం ద్వారా మిస్సింగ్ కేసును హత్య కేసుగా మార్చారు. ప్రైవేట్ సంస్థలో పనిచేసే అరుణ్ సింగ్‌తో సహా వారిలో చాలామంది పరారీలో ఉన్నారు. భూప్ సింగ్ వారి నివాసంలోని గ్రౌండ్ ఫ్లోర్ నుండి టైలర్ దుకాణం నడుపుతున్నాడు.