Uttar Pradesh Crime News: ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్‌లో మర్చంట్ నేవీ అధికారి హత్యకు గురైన ఘటన అందరికీ తెలిసిందే. ఇందులో నిందితులను విచారిస్తున్న కొద్దీ విస్తుపోయే విషయాలు వెగులోకి వస్తున్నాయి. ప్రియుడి మోజుల పడిన అతని భార్య చేసిన దారుణాల గురించి తెలిసి పోలీసులే షాక్ తింటున్నారు. 

కుమార్తె పుట్టిన రోజు కోసం సౌరభ్ రాజ్‌పుత్‌ ఇండియాకు వచ్చాడు. తన సొంత ఇంటికి వచ్చి అక్కడి నుంచి కాస్త దూరంలో ఉన్న పేరెంట్స్‌ ఇంటికి కూడా వెళ్లాడు. అక్కడ తనకు ఇష్టమైన వంటకాన్ని తల్లి చేసింది. దాన్ని భార్యతో కలిసి తిందామని తీసుకొచ్చాడు. అతి చల్లారిపోయిందని చెప్పిన భార్య ముస్కాన్ రస్తోగి వేడి చేసింది. ఈ నెపంతో అందులో మత్తుమందులు కలిపింది. 

ఈ మత్తు మందులు సంపాదించడానికి కూడా చాలా కుట్రలు చేసిందీ ముస్కాన్ రస్తోగి. డిప్రషన్‌కు గురి అవుతున్నానని చెప్పి ఓ డాక్టర్ వద్దకు వెళ్లింది. తనకు రాత్రిపూట నిద్రపట్టడం లేదంటూ చెప్పింది. దీంతో ఆ డాక్టర్‌ తక్కువ పవర్ ఉన్న నిద్రమాత్రులు రాసి ఇచ్చారు. మందుల చీటీ తీసుకెళ్లి షాపులో చూపించింది. అందులో రాసిన డోస్‌, రాసిన మాత్రల సంఖ్య ప్రకారం ఇచ్చారు. 

వైద్యులు ఇచ్చిన మందులతో తన కుట్ర సాగని గ్రహించిన ముస్కాన్ రస్తోగి మరో ప్లాన చేసింది. గూగుల్‌లో నిద్రమాత్రల కోసం వెతికింది. హైపవర్ ఉన్న మాత్రలు గురించి తెలుసుకుంది. డాక్టర్‌ ఇచ్చిన చీటీలో ఉన్న ఖాళీ ప్రదేశంలో ఈమె గూగుల్‌లో చూపిన మందులు రాసింది. ఇలా చాలా హైడోస్‌ ఉన్న మెడిసిన్ తీసుకొచ్చింది. 

ముందుగానే తీసుకొచ్చిన నిద్రమాత్రలను అత్తగారు పంపించిన వంటకలో కలిపేసి భర్త సౌరభ్‌కు పెట్టింది. అసలు విషయం తెలుసుకోలేకపోయిన అతను దాన్ని సుబ్బరంగా తినేసి గుర్రుపెట్టి నిద్రపోయాడు. తర్వాత ప్రియుడి ఫోన్ చేసి పిలిచింది. ఇద్దరూ కలిసి సౌరభ్‌ను మట్టుబెట్టారు. మత్తుతో గాఢ నిద్రలో ఉన్న సౌరభ్‌ మొహంపై దిండు పెట్టి ఊపిరి ఆడకుండా చేసి చంపేశారు. 

అలా చంపేసిన సౌరభ్‌ డెడ్‌బాడీని మాయం చేయడానికి ముస్కాన్ రస్తోగి, ప్రియుడు సాహిల్‌ ఇద్దరు చేసిన ప్రయత్నాలు అదర్నీ విస్తుగొలిపుతున్నాయి. డెడ్‌బాడీని బాత్రూమ్‌కు తీసుకెళ్లి ముక్కలు ముక్కలుగా కట్ చేశారు. అలా కట్ చేసిన బాడీపార్ట్స్‌ను వేర్వేరు నిర్మానుష్య ప్రాంతాల్లో పడేయాలని భావించారు. అయితే హోలీ సందర్భంగా జన సంచారం ఎక్కువ ఉండటంతో అది వీలు పడలేదు. 

ఆ బాడీ పార్ట్స్‌ను భద్రపరిచారు. బెడ్‌కు ఉండే పెట్టెలో సౌరభ్‌ మొండాన్ని భద్రపరించింది. తల, చేతులు ఎక్కడ పెట్టినా కనిపిస్తాయని గ్రహించి సాహిల్ తనతోనే ఆ రెండింటినీ తీసుకెళ్లిపోయాడు. పక్కింట్లో ఎవరైనా చనిపోయారని చెబితేనే చాలా మందికి నిద్రపట్టదు. అలాంటి ముస్కాన్ రస్తోగి మాత్రం భర్త మొండం బెడ్‌ బాక్స్‌లో ఉన్నా ప్రశాంతంగా ఆ బెడ్‌పైనే నిద్రపోయింది.  

తర్వాత రోజు ముస్కాన్ రస్తోగి ఇంటికి వచ్చిన సాహిల్‌ లోకల్ మార్కెట్‌లో పెద్ద డ్రమ్ తీసుకొని వచ్చాడు. అందులో నింపేందుకు సిమెంట్‌ ఇతర చెత్తను తీసుకొచ్చాడు. సౌరభ్ డెడ్‌బాడీని మరికొన్ని ముక్కలు చేసి అందులో వేసి కాంక్రీట్‌, చెత్తాచెదారంతో నింపేశారు. బయటకు కనిపించకుండా సీల్ చేశారు.  

ఆ డెడ్‌బాడీ ఉన్న డ్రమ్‌ను ఇంటి ఆవరణంలో పెట్టేసిన 11 రోజుల తర్వాత జరిగిన హోలీ వేడుకల్లో పాల్గొని ముస్కాన్ రస్కోగి. ప్రియుడితో కలిసి ఆడింది పాడింది. ఆ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీళ్లిద్దరు చిన్నప్పటి నుంచే ఫ్రెండ్స్‌ అని పోలీసులు చెబుతున్నారు. చాలా కాలంగా కలుసుకోలేదు. స్కూల్‌ బ్యాచ్‌ వాళ్లంతా వాట్సాప్‌ గ్రూప్ క్రియేట్ చేశారు. దీంతో మళ్లీ వీళ్లిద్దరు మరోసారి మాట్లాడుకోవడం కలుసుకోవడం చేశారు. తర్వాత అది వివాహేతర సంబంధానికి దారి తీసింది.  

సౌరభ్, ముస్కాన్‌ది కూడా ప్రేమ పెళ్లే. వీళ్లకు ఐదేళ్ల పాప ఉంది. వీళ్లకు 2016లోనే పెళ్లి అయింది. పెళ్లైనప్పటి మూడేళ్ల నుంచి భర్తపై అయిష్టత ఏర్పడింది. చాలా సార్లు చంపడానికి ట్రై చేసిందని బంధువులు చెబుతున్నారు. ఇద్దరి మధ్య విభేదాల కారణంగా విడాకుల వరకు వివాదం వెళ్లింది. కానీ కుమార్తె కోసం సౌరభ్‌ సర్ధుకుపోయాడని చెబుతున్నారు. ముస్కాన్‌ను సినిమాలంటే పిచ్చి తన కూడా సినిమాల్లో నటించాలని అనుకునేది. దీని కోసం ఓసారి ఇంటి నుంచి  కూడా వెళ్లిపోయినట్టు ఆమె తరఫు బంధువులు చెబుతున్నారు.