Medical Student Death: విశాఖపట్నంలో మెడికో విద్యార్థి రమేష్ కృష్ణ ఆత్మహత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఆమె బలవన్మరణానికి ప్రేమ వ్యవహారమే కారణం అని పోలీసులు భావిస్తున్నారు. వాట్సాప్ చాటింగ్, ఫోన్ కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రియుడితో ఏర్పడిన మనస్పర్థలే ఆత్మహత్యకు కారణం అని పోలీసులు తేల్చారు. ఈనెల 23వ తేదీన విశాఖకు వచ్చిన రమేష్ కృష్ణ అంతకు ముందే ఇండోర్ లో ఉన్న ప్రియుడిని కలిసింది. చైనాలో ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదువుతున్న మెడికో విద్యార్థి స్వస్థలం కేరళలోని త్రిశూర్ జిల్లా వందనపల్లి మండలం. ఈనెల 13న తేదీన తన ఇంటి నుంచి తిరుగు ప్రయాణమై 18వ తేదీన వైజాగ్‌ చేరుకుంది. డాబా గార్డెన్స్‌లోని లాడ్జిలో అద్దెకు దిగి ఆగస్టు 19వ తేదీన గది ఖాళీ చేసింది. 


మళ్లీ ఈనెల 23వ తేదీన విశాఖకు వచ్చిన యువతి అంతకు ముందే ఇండోర్ లో ఉన్న ప్రియుడిని కలిసింది. తిరిగి మళ్లీ ఈ నెల 24న ఆమె అదే గదికి వచ్చింది. 24న చెక్ అవుట్ చేయాల్సి ఉండగా, ఆమె గది నుంచి బయటకు రాలేదు. లోపల నుంచి గడియపెట్టి ఉండటంతో అనుమానించిన లాడ్జి నిర్వహకులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తలుపును బద్దలుగొట్టి లోపలికి ప్రవేశించారు.  యువతి గదిలో ఫ్యానుకు ఉరి వేసుకుని నిర్జీవంగా వేలాడుతున్నట్టు కనిపించింది. పక్కనే సూసైడ్ నోట్ కనిపించింది. అందులో మలయాళంలో ఏం రాసిందంటే.. జీవితంలో ఓడిపోయానని, తన చావుకు ఎవరూ బాధ్యులు కారని, సారీ అమ్మా అంటూ రాసి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. యువతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈక్రమంలోనే ప్రేమ వ్యవహారమే కారణం అని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.