Mastan Sai recorded private videos of hero Nikhil : రాజ్ తరుణ్, లావణ్య  వివాదంలో ఎక్కువగా వినిపించిన పేరు మస్తాన్ సాయి. అతనిపై తాజాగా లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. అమ్మాయిల్ని ట్రాప్ చేసి వారి ప్రైవేటు వీడియోలు తీసి బెదిరిపులకు పాల్పడుతున్నాడని.. కొంత మంది సెలబ్రిటీల ఫోన్లను హ్యాక్ చేసి.. వారి ప్రైవేటు వీడియోల్ని కూడా రికార్డు చేశారని ఫిర్యాదు చేసింది. కొన్ని వీడియోలను పోలీసులకు ఇవ్వడంతో పోలీసులు వెంటనే మస్తాన్ సాయిని అరెస్టు చేసి ఆ హార్డ్ డిస్క్ స్వాధీనం చేసుకున్నారు. అందులో వందల సంఖ్యలో వీడియోలు ఉన్నట్లుగా గుర్తించారు. హీరో నిఖిల్ కు చెందిన ప్రైవేటు వీడియోలు కూడా ఉన్నట్లుగా గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఈ వీడియోలన్ని ఎలా వచ్చాయి.. ఎంత మందిని బ్లాక్ మెయిల్ చేశారన్న దానిపై పోలీసులు కూపీ లాగుతున్నారు. 


మస్తాన్ సాయి టాలీవుడ్ లో చాలా వివాదాస్పదమైన వ్యక్తిగా పేరుంది. డ్రగ్స్ పెడ్లర్‌గా పలువురికి పరిచయం. లావాణ్య - రాజ్ తరుణ్  వివాదంలో ఈయన పేరు ప్రముఖంగా బయటకు వచ్చింది.  అప్పట్లో ఆయన పరార్ కావడంతో  గుంటూరులోని ఓ దర్గాలో తలదాచుకున్నట్లుగా గుర్తించి గత ఏడాది ఆగస్టులో అరెస్టు చేశారు.    హైదారాబాద్ లోని వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్స్ కేసులనూ మస్తాయి సాయి నిందితుడు.  . పోలీసులు మస్తాన్ సాయి ఫోన్‌ను స్వాధీనం  చేసుకుని అందులో వివరాలను పరిశీలిస్తే..  మైండ్ బ్లాంకయ్యే నిజాలు వెలుగులోకి వచ్చాయి. మస్తాన్ సాయి ఫోన్ లో చాలా మంది అమ్మాయి ల ప్రైవేటు వీడియోలు ఉన్నట్లు గుర్తింంచారు. పలువురు అమ్మాయిలు ప్రయివేటు వీడియోలు చిత్రకరించి బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు గుర్తించారు. 
                  
అప్పట్లో మస్తాన్ సాయి మొబైల్ లో వీడియోలపై ఆరా తీస్తున్న పోలీసులు .. వారిని ఎలా ట్రాప్ చేశారో తెలుసుకుంటున్నారు. ఏపీ , తెలంగాణా  కి చెందిన అమ్మాయిలను టార్గెట్ గా చేసుకొని మస్తాన్ సాయి మోసం చేస్తున్నట్లు గుర్తించారు. సినిమా అవకాశాలు .. ఇతర ప్రలోభాలకు గురి చేసి మస్తాన్ సాయి యువతుల్ని వంచిస్తున్నట్లుగా భావిస్తున్నారు. ఈ క్రమంలో లావణ్య కూడా మస్తాన్ సాయి ట్రాప్ లో పడినట్లుగా తెలుస్తోంది. మస్తాన్ సాయితో కలిసి డ్రగ్స్ తీసుకోవడం ప్రారంభించిన తర్వాతనే లావణ్య దూరమైందని.. డ్రగ్స్ తీసుకోవద్దని ఎన్ని సార్లు చెప్పినా వినలేదని చెప్పారు. అయితే తర్వాత మస్తాన్ సాయి .. లావణ్యను కూడా దూరం పెట్టారు. అయితే  ప్రముఖల వీడియోను రికార్డు చేసి బ్లాక్ మెయిల్ చేస్తూండటంతో..  పోలీసులకు లావాణ్య సమాచారం ఇచ్చింది. 


నిఖిల్ తో ఉన్న పరిచయం మేరకు ఆయన ఫోన్ లో బగ్ ను పంపి.. వీడియోలు రికార్డు చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. మస్తాన్ సాయిని అరెస్టు చేసిన పోలీసులు.. పూర్తి వివరాలు బయటకు లాగేందుకు ప్రయత్నిస్తున్నారు.  హార్డ్ డిస్క్ లో పెద్ద ఎత్తున వీడియోలు ఉండటంతో  వారిలో బాధితుల్ని గుర్తించే పనిలో ఉన్నారు.